Washing Machine: వాషింగ్‌ మెషీన్‌లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Washing Machine: బట్టలు ఉతకడం మునుపటిలా కష్టమైన పని కాదు.

Update: 2022-10-12 07:00 GMT

Washing Machine: వాషింగ్‌ మెషీన్‌లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Washing Machine: బట్టలు ఉతకడం మునుపటిలా కష్టమైన పని కాదు. ఈ రోజుల్లో అందరికి అందుబాటులో వాషింగ్ మెషీన్లు ఉన్నాయి. వీటివల్ల ఈ పని కేవలం తక్కువ సమయంలో సులభంగా చేసుకోవచ్చు. అయితే మార్కెట్లో ఇటువంటి ఆటోమేటిక్ యంత్రాలు చాలా ఉన్నాయి. కానీ బట్టలు ఉతికేటప్పుడు చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ వహించకపోతే బట్టలు శుభ్రం కావడానికి బదలు పాడైపోతాయి. అంతేకాదు కొన్నిసార్లు చిరిగిపోతాయి. వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు ఉతికేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

వాషింగ్ మెషీన్ ఆటోమేటిక్ అయినా, సెమీ ఆటో అయినా వాటిని వాడడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ ఇవి చాలామందికి తెలియదు. ఈ కారణంగా చాలా సార్లు వాషింగ్ మెషీన్‌లో బట్టలు చిరిగిపోతాయి. బట్టల రంగు కూడా వెలిసిపోతుంది. సరైన పద్దతులు పాటించకుంటే అంత నష్టమే. కొన్ని చిట్కాలు పాటిస్తే బట్టలు సులభంగా శుభ్రంగా చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.

1. బట్టలు ఉతకడానికి ముందు వాటిని వివిధ వర్గాలుగా విభజించాలి. ఎక్కువ మురికి బట్టలు, తక్కువ మురికి బట్టలుగా వేరు చేయాలి.

2. కొత్త బట్టలు విడిగా ఉంచాలి. పాత బట్టలు వేరు చేయాలి. వీటిలో కొన్ని బరువైన బట్టలు ఉంటాయి. వీటిని విడిగా ఉంచాలి. తేలికపాటి దుస్తులను విడిగా చేయాలి.

3. బట్టలపై నేరుగా సర్ఫ్‌ను వేయవద్దు. ముందుగా మెషిన్‌లో నీళ్లు పోసి సర్ఫ్ వేసి కాసేపు అలాగే ఉంచి అందులో బట్టలు వేయాలి. బట్టలు ఉతికేటప్పుడు దుస్తుల జిప్, హుక్ క్లోజ్‌ చేసి వేయాలి.

4. బట్టలు ఉతికేటప్పుడు నీరు, డిటర్జెంట్ పౌడర్ మోతాదులో జాగ్రత్త వహించాలి. తక్కువ నీటిలో ఎక్కువ డిటర్జెంట్ పౌడర్ వేస్తే బట్టలు పాడవుతాయి.

5. మనం డ్రైయర్ వాడకాన్ని తగ్గించి బట్టలను ఎండలో మాత్రమే ఆరబెట్టడానికి ప్రయత్నించాలి. దీంతో బట్టలు మెరుస్తూ ఉంటాయి.

6. వాషింగ్ మెషీన్లో కొత్త బట్టలు వేసేటప్పుడు అవి రంగుని కోల్పోతాయని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News