Gum Bleeding: చిగుళ్ల నుంచి రక్తం కారుతుందా.. ఆపడానికి ఈ చిట్కాలు పాటించండి..!

Gum Bleeding:ఈ రోజుల్లో చిగుళ్ల నుంచి రక్తం కారడం సర్వసాధారణంగా మారింది. నిత్యం చాలామంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు.

Update: 2023-10-13 13:30 GMT

Gum Bleeding: చిగుళ్ల నుంచి రక్తం కారుతుందా.. ఆపడానికి ఈ చిట్కాలు పాటించండి..!

Gum Bleeding: ఈ రోజుల్లో చిగుళ్ల నుంచి రక్తం కారడం సర్వసాధారణంగా మారింది. నిత్యం చాలామంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. పంటి నొప్పి, నాలుక వాపు, కావిటి సమస్యల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడంతో ఇబ్బంది పడుతుంటే కొన్ని సులభమైన చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. ఉప్పు, వేడి నీళ్లతో పుక్కిలించడం

వేడి నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించడం వల్ల చిగుళ్ల రక్తస్రావం ఆగిపోతుంది. ఈ రెమెడీ చిగుళ్ల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

2. వేపనూనె

చిగుళ్ల రక్తస్రావం ఆపడంలో వేపనూనె ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రాత్రి పడుకునే ముందు చిగుళ్లపై రాసి ఉదయాన్నే కడిగేయవచ్చు.

3. అలోవెరా జ్యూస్

అలోవెరా జ్యూస్ చిగుళ్ల రక్తస్రావం ఆపడంలో సహాయపడుతుంది. కలబంద ఆకులను కోసి వాటి నుంచి తీసిన రసాన్ని చిగుళ్లపై రాసుకోవచ్చు.

4. తాజా పండ్లు, కూరగాయలు

తాజా పండ్లు, కూరగాయలు తినడం చిగుళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. చిగుళ్ల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

5. సరిపడా నీరు తాగడం

చిగుళ్ల ఆరోగ్యానికి తగినంత నీరు తాగడం అవసరం. సరిపడా నీటిని తీసుకోవడం వల్ల శరీరం తాజాగా ఉంటుంది. చిగుళ్లు సక్రమంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది.

Tags:    

Similar News