Health Tips: ఎండాకాలం జుట్టు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఇవి చేయాల్సిందే..!
Health Tips: ప్రతి ఒక్కరూ అందమైన, ఆకర్షణీయమైన జుట్టును కలిగి ఉండాలని కోరుకుంటారు.
Health Tips: ప్రతి ఒక్కరూ అందమైన, ఆకర్షణీయమైన జుట్టును కలిగి ఉండాలని కోరుకుంటారు. కానీ ఇది అందరికి సాధ్యంకాదు. రెగ్యులర్ హెయిర్ వాషింగ్, కండిషనింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో జుట్టు పోషణ కొంత ఇబ్బందితో కూడుకున్నది. ఇందుకోసం కొన్ని ప్రత్యేక చిట్కాలని పాటించాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
సూర్యుని దెబ్బ
సూర్యుని UV కిరణాలు జుట్టును దెబ్బతీస్తాయి. రంగు మారడానికి కారణమవుతాయి. అందుకే సూర్యరశ్మి నుంచి జుట్టును రక్షించుకోవడానికి టోపీని ధరించండి. లేదా కండువా ఉపయోగించండి.
జుట్టు హైడ్రేట్
శరీరం, జుట్టుని హైడ్రేట్ గా ఉంచడానికి పుష్కలంగా నీరు తాగాలి. అలాగే జుట్టును కడగడానికి వేడి నీటిని ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది సహజ నూనెలను దెబ్బతీస్తుంది.
షాంపూ
జుట్టు నుంచి చెమటను తొలగించడానికి వారానికి ఒకసారి క్లారిఫైయింగ్ షాంపూని ఉపయోగించడం మేలు.
హీట్ స్టైలింగ్ సాధనాలు
బ్లో డ్రైయర్‌లు, స్ట్రెయిట్‌నర్‌లు, కర్లింగ్ ఐరన్‌లు వంటి హీట్ స్టైలింగ్ సాధనాలను ఉపయోగించకుండా ఉండటం ఉత్తమం. ఎందుకంటే అవి జుట్టుకు హాని కలిగిస్తాయి.
తరచుగా జుట్టు కడగడం
వేసవిలో తలపై పేరుకున్న చెమట, మురికిని తొలగించడానికి జుట్టును తరచుగా కడగాలి. సహజ నూనెలను తొలగించకుండా తేలికపాటి షాంపూని ఉపయోగించాలి.
ఆరోగ్యకరమైన ఆహారం
జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తినాలి. ఇలాంటి ఆహారాలని డైట్‌లో కచ్చితంగా చేర్చుకోవాలి.