Fasting Tips: మీరు ఉపవాసం చేస్తారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!

Fasting Tips: చాలామంది దైవచింతనలో భాగంగా వారానికి ఒకటి లేదా రెండు రోజులు ఉపవాసం చేస్తారు.

Update: 2023-03-24 13:30 GMT

Fasting Tips: మీరు ఉపవాసం చేస్తారా.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..!

Fasting Tips: చాలామంది దైవచింతనలో భాగంగా వారానికి ఒకటి లేదా రెండు రోజులు ఉపవాసం చేస్తారు. ఈ సమయంలో అన్నం, చపాతి వంటి ఆహారాలకి దూరంగా ఉంటారు. కేవలం పండ్లను మాత్రమే డైట్‌లో చేర్చుకుంటారు. ఉపవాసం చేయడం వల్ల శరీరానికి, మనస్సుకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కానీ సరిపోయేంత ఆహారం తినకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీని వల్ల చాలా సార్లు మలబద్ధకం, అసిడిటీ సమస్యలు ఏర్పడుతాయి. ఇలాంటి సమయంలో మీరు కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు.

సిట్రస్ పండ్లు తినవద్దు

ఉపవాస సమయంలో ఖాళీ కడుపుతో పుల్లటి పండ్లను తినడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ వంటివి తీసుకోకూడదు. బదులుగా ఆహారంలో అరటి, చికు, జామ వంటి పండ్లను చేర్చుకోవచ్చు. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

హైడ్రేటెడ్ గా ఉండండి

హైడ్రేటెడ్ గా ఉండటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఉపవాస సమయంలో తగినంత నీరు తాగాలి. ఒకేసారి ఎక్కువ నీరు తాగే బదులు సిప్ బై సిప్ నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి.

ఆరోగ్యకరమైన పానీయాలు

ఉపవాస సమయంలో మజ్జిగ, చల్లని పాలు వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకోవచ్చు. ఇవి కడుపుని చల్లగా ఉంచుతాయి. ఇది కాకుండా కొబ్బరి నీరు తాగవచ్చు. ఇది pH స్థాయిని మెయింటెన్‌ చేయడానికి దోహదం చేస్తుంది. ఇది శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది.

వ్యాయామం

మీరు ఉపవాస సమయంలో హై ఇంటెన్సిటీ వర్కవుట్‌లు చేయాల్సిన అవసరం లేదు. యోగా, నడక వంటివి చేయవచ్చు. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో రక్త ప్రసరణను పెంచుతుంది.

అధిక ఫైబర్

మీరు ఆహారంలో అధిక ఫైబర్ ఉండే ఆహారాలను చేర్చుకోవకాలి. ఇవి మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. ఆహారంలో బుక్వీట్ పిండి, మఖానా, రాగిపిండి వంటి ఆహారాలను చేర్చుకోవచ్చు. ఈ ఆహారాల నుంచి అధికంగా ఫైబర్ పొందుతారు.

Tags:    

Similar News