Health Tips: ఈ విత్తనాలు బరువు తగ్గించడంలో సూపర్.. వారంలో ఫలితం తెలుస్తుంది..!
Health Tips: ఈ రోజుల్లో పెరిగిన బరువుని తగ్గించుకోవడానికి చాలామంది రకరకాలుగా కష్టపడుతున్నారు.
Health Tips: ఈ రోజుల్లో పెరిగిన బరువుని తగ్గించుకోవడానికి చాలామంది రకరకాలుగా కష్టపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం మాత్రం దక్కడంలేదు. ఈ పరిస్థితుల్లో వ్యాయామంతో పాటు అవిసెగింజలు తీసుకోవాలి. ఇది పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. ఇవి బరువు తగ్గించడమే కాకుండా శరీరంలో ఉన్న అనేక ఇతర సమస్యలను తొలగిస్తుంది.
అవిసె గింజలలో ఉండే పోషకాలు
అవిసె గింజలు సూపర్‌ఫుడ్. ఇవి శరీర అభివృద్ధికి చాలా అవసరం. శరీరానికి అన్ని విధాలా మేలు చేసే ఈ గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అవిసె గింజలను రోజువారీ జీవితంలో చేర్చుకుంటే చాలా మంచిది.
బరువును ఎలా తగ్గిస్తాయి?
అవిసె గింజలు అనేక వ్యాధులలో సహాయపడతాయి. కానీ వీటితో పెరుగుతున్న బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఈ గింజల్లో బరువు తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిజానికి అవిసెగింజలు తినడం వల్ల తొందరగా ఆకలివేయదు. దీంతో తక్కువ ఆహారం తీసుకుంటారు. ఈ విత్తనాల వల్ల శరీరంలో మంటలు, వాపులు తగ్గుతాయి. జీర్ణక్రియ బాగా జరగడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.
వీటిని ఎలా తీసుకోవాలి..?
మీరు పాలు, ఆపిల్ స్మూతీతో కలిపి అవిసెగింజలని తీసుకోవచ్చు. ఇందుకోసం ఒక కప్పు పాలు, 2 ఖర్జూరాలను గ్రైండర్లో మిక్స్ చేసి ఒక చెంచా అవిసెగింజల పౌడర్ ఇందులో కలిపి తాగాలి. కొన్ని వారాలలో మీరు బరువు తగ్గడం చూస్తారు.