Green Tea vs Black Tea: గ్రీన్‌ టీ, బ్లాక్ టీ ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?

Green Tea vs Black Tea: గ్రీన్ టీ, బ్లాక్ టీ మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. గ్రీన్ టీ ఆయుర్వేద ఆకుల పొడితో తయారుచేస్తారు.

Update: 2023-11-11 16:00 GMT

Green Tea vs Black Tea: గ్రీన్‌ టీ, బ్లాక్ టీ ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?

Green Tea vs Black Tea: గ్రీన్ టీ, బ్లాక్ టీ మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. గ్రీన్ టీ ఆయుర్వేద ఆకుల పొడితో తయారుచేస్తారు. బ్లాక్ టీ టీ ఆకుల పొడితో తయారుచేస్తారు. ఈ వ్యత్యాసం కారణంగా గ్రీన్ టీ, బ్లాక్ టీలో పోషకాల పరిమాణం, నాణ్యతలో తేడా ఉంటుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. గ్రీన్ టీలో క్యాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. క్యాటెచిన్స్ బరువు తగ్గడానికి, మధుమేహాన్ని నియంత్రించడంలో, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ గ్రీన్ టీ కంటే తక్కువ పరిమాణంలో ఉంటాయి. బ్లాక్ టీలో కెఫిన్ మొత్తం గ్రీన్ టీ కంటే ఎక్కువగా ఉంటుంది. కెఫిన్ ఒక ఉద్దీపన. ఇది శక్తి స్థాయిలను పెంచడానికి, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఏ టీ మంచిది?

గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఏ టీ మంచిది అనేది వ్యక్తిగత అవసరాలు, ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచడం, బరువు తగ్గడం పట్ల మీకు ఆసక్తి ఉంటేగ్రీన్ టీ మంచి ఎంపిక అవుతుంది.కెఫిన్ స్థాయిలను పెంచడం, శక్తి స్థాయిలను పెంచడం పట్ల ఆసక్తి కలిగి ఉంటే బ్లాక్ టీ మంచి ఎంపిక అవుతుంది. మీరు ఏదైనా నిర్దిష్ట ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే మీకు ఏ టీ మంచిది అనే దాని గురించి వైద్యుడిని సంప్రదించండం ఉత్తమం.

Tags:    

Similar News