Alcohol Milk: ఈ పాలు మానవులకి చాలా ప్రమాదకరం.. విస్కీ తాగినదానికంటే ఎక్కువ కిక్కు..!

Alcohol Milk: ఈ పాలు మానవులకి చాలా ప్రమాదకరం.. విస్కీ తాగినదానికంటే ఎక్కువ కిక్కు..!

Update: 2023-06-09 15:00 GMT

Alcohol Milk: ఈ పాలు మానవులకి చాలా ప్రమాదకరం.. విస్కీ తాగినదానికంటే ఎక్కువ కిక్కు..!

Alcohol Milk: పాలు సంపూర్ణ ఆహారమని అందరికి తెలిసిందే. ఎందుకంటే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవితానికి ఇవన్నీ అవసరమే.పాలలో ప్రొటీన్లు, ఎసెన్షియల్ అమైనో యాసిడ్లు, కాల్షియం, విటమిన్లు, మినరల్స్, కొవ్వు పుష్కలంగా లభిస్తాయి. పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతో పాటు దంతాలకు మేలు జరుగుతుంది. డైట్‌లో చేర్చడం వల్ల కండరాలు, కణజాలాల అభివృద్ధికి తోడ్పడుతాయి. మొత్తం మీద పాలు ఆరోగ్యానికి చాలా మంచిది.

అయితే సాధారణంగా మనం ఆవు, గేదె లేదా మేక పాలు తాగుతాం. కానీ ఒక జంతువు పాలలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీరు దీన్ని కూడా నమ్మకపోవచ్చు. కానీ ఇది మాత్రం నిజం.ఆడ ఏనుగు పాలలో 60 శాతం ఆల్కహాల్ ఉంటుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏనుగులు తమ ఆహారంలో ఇథనాల్‌ ప్రధాన వనరు అయిన చెరకును తింటాయి. దీని నుంచి వైన్ కూడా తయారు చేస్తారు. ఏనుగు సగటున రోజుకు 150 కిలోల ఆహారం తింటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడంతో పాటు ఏనుగులు ఉత్పత్తి చేసే పాలలో పోషకాలతోపాటు ఆల్కహాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనుషులకు ఏనుగు పాలు జీర్ణం కావడం చాలా కష్టం.

మానవులకు ప్రమాదకరం

ఒక పరిశోధన ప్రకారం ఏనుగు పాలలో కనిపించే రసాయనాలు ఇతర జంతువులలో కంటే చాలా ఎక్కువ. ఆఫ్రికన్ ఏనుగు పాలలో 62 శాతం ఆల్కహాల్ ఉన్నట్లు కనుగొన్నారు. ఇది విస్కీ బాటిల్‌లో లభించే ఆల్కహాల్ కంటే చాలా ఎక్కువ. పాడి జంతువులలో తక్కువగా ఉండే ఒలిగోసాకరైడ్స్ అని పిలువబడే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి అధికంగా ఉండటం వల్ల ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు సంభవిస్తాయి. అందుకే ఏనుగు పాలు మానవులకు ప్రమాదకరమని చెబుతారు.

Tags:    

Similar News