Mental Health: కడుపునొప్పి వల్ల మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్‌.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

Mental Health: జీర్ణక్రియ సరిగ్గా లేకుంటే శరీరం అనేక రకాలుగా దెబ్బతింటుంది. తిన్న ఆహారం జీర్ణం కాకుంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

Update: 2023-06-06 14:00 GMT

Mental Health: కడుపునొప్పి వల్ల మానసిక ఆరోగ్యంపై ఎఫెక్ట్‌.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

Mental Health: జీర్ణక్రియ సరిగ్గా లేకుంటే శరీరం అనేక రకాలుగా దెబ్బతింటుంది. తిన్న ఆహారం జీర్ణం కాకుంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. చాలా మందికి కడుపు సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి. పేగుల్లో ఇన్ఫెక్షన్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ సరిగా జరగక పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతింటుంది.

గట్, మానసిక ఆరోగ్యం మధ్య సంబంధం

జీర్ణక్రియ సమస్యలు చాలా కాలంగా కొనసాగితే మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మీ కడుపులో సమస్య ఉంటే వీలైనంత త్వరగా చికిత్స పొందండి. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది.

మంచి ఆహారం

కడుపు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మంచి ఆహారం తీసుకోవడం వల్ల కడుపు చక్కగా ఉంటుంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి. రోజూ వ్యాయామం చేయాలి. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం యోగా కూడా చేయవచ్చు.

సిగరెట్ మద్యం వదిలేయండి

జీర్ణక్రియ బాగా జరగాలంటే ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. నెమ్మదిగా వదిలేయడానికి ప్రయత్నించాలి. ఆల్కహాల్ ఎక్కువగా తాగితే కడుపులో ఇబ్బంది ఉంటుంది. ఆల్కహాల్‌తో పాటు సిగరెట్ తాగడం చాలా ప్రమాదకరం. జీవనశైలిలో కొన్ని మార్పులు చేస్తే జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది.

Tags:    

Similar News