Health Tips: పరగడుపున ఈ పవిత్రమైన ఆకులు తినండి.. ఈ తీవ్రమైన సమస్యకి చెక్ పెట్టండి..!
Health Tips: ఆయుర్వేదంలో తులసిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకుంటే ఇందులో అద్భుత ఔషధగుణాలు దాగి ఉంటాయి.
Health Tips: ఆయుర్వేదంలో తులసిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకుంటే ఇందులో అద్భుత ఔషధగుణాలు దాగి ఉంటాయి. తులసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు దీనికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది. భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఇంటి ఆవరణలో తులసి మొక్కను నాటడం, పూజించడం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా రోజూ ఉదయం పరగడుపున తులసిని తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో శారీరక, మానసిక సమస్యలు దూరమవుతాయి. తులసి అద్భుతమైన ప్రయోజనాల గురిరంచి ఈరోజు తెలుసుకుందాం.
1. జలుబు, ఫ్లూ దూరం
తులసి ఆకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. జలుబు సమస్య ఉంటే తులసి ఆకులను తినవచ్చు. ఖాళీ కడుపుతో తులసి ఆకులు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. జీర్ణక్రియకు మేలు
జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారికి తులసి దివ్యవౌషధంగా పనిచేస్తుంది. చేయాల్సిందల్లా తులసి ఆకులను రోజూ ఖాళీ కడుపుతో నమలడం. ఇది మీకు ఎసిడిటీ, పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
3. ఒత్తిడిని తగ్గిస్తుంది
తులసి ఆకులు శారీరక సమస్యలలో, మానసిక సమస్యలలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే అడాప్టోజెన్‌లు ఒత్తిడి, టెన్షన్‌ను నియంత్రించడంలో సహాయపడతాయని అనేక అధ్యయనాలలో వెల్లడైంది. అంతేకాదు నాడీ వ్యవస్థను సడలించడం ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. దీని ఆకులను తీసుకోవడం వల్ల ఒత్తిడి సమస్య నుంచి బయటపడతారు.
4. రోగనిరోధక శక్తి పెరుగుతుంది
తులసి ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతాయి. ఇందుకోసం రోజూ ఖాళీ కడుపుతో తులసి ఆకులను తినాలి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీబయాటిక్ లక్షణాలు వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి.