Health Tips: పరగడుపున పచ్చి వెల్లుల్లి.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
Health Tips: భారతదేశంలోని ప్రతి ఒక్కరి వంటింట్లో వెల్లుల్లి ఉంటుంది.
Health Tips: భారతదేశంలోని ప్రతి ఒక్కరి వంటింట్లో వెల్లుల్లి ఉంటుంది. దాదాపు కూరలన్నింట్లో వెల్లుల్లి వేస్తారు. దీనివల్ల రుచి పెరుగుతుంది. వాస్తవానికి వెల్లుల్లి గుణం వేడిగా ఉంటుంది. ఇందులో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తాయి. వెల్లుల్లి అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నివారిస్తుంది. వెల్లుల్లిని ఆయుర్వేదంలో మందుల తయారీకి ఉపయోగిస్తారు. పరగడుపున వెల్లుల్లి తినడం వల్ల కలిగే లాభాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
1. క్యాన్సర్ నివారణ
యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు వెల్లుల్లిలో ఉంటాయి. కాబట్టి ఉదయాన్నే ఏమీ తినకుండా వెల్లుల్లిని నమిలితే క్యాన్సర్ ముప్పు చాలా వరకు తగ్గుతుంది.
2. డయాబెటిస్
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 4 వెల్లుల్లి రెబ్బలు తినాలి.
3. బరువు తగ్గుతారు
ప్రతిరోజూ ఉదయం నిద్రలేచి ఖాళీ కడుపుతో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే బరువు తగ్గుతారు. శరీరంలోని అదనపు కొవ్వును కరిగించే గుణాలు వెల్లుల్లిలో ఉంటాయి.
4. డిప్రెషన్ దూరం చేస్తుంది
వెల్లుల్లిని తీసుకోవడం మానసిక ఆరోగ్యానికి అత్యవసరం. దీని సహాయంతో మనస్సు సమతుల్యంగా ఉంటుంది. డిప్రెషన్‌తో పోరాడే శక్తిని అందిస్తుంది. ఒత్తిడిని నివారించడానికి తరచుగా వెల్లుల్లి తినాలని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తారు.