Eat Vegetables: ఊబకాయం తగ్గాలంటే ఈ కూరగాయలు తినండి.. అదనపు కొవ్వు కరుగుతుంది..!

Eat Vegetables: ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం శ్రమ తగ్గించడం అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం.

Update: 2023-09-14 14:30 GMT

Eat Vegetables: ఊబకాయం తగ్గాలంటే ఈ కూరగాయలు తినండి.. అదనపు కొవ్వు కరుగుతుంది..!

Eat Vegetables: ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం శ్రమ తగ్గించడం అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం. ఊబకాయం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే ప్రతిరోజూ వ్యాయామం చేయడం అవసరం. దీంతో పాటు సరైన బరువును మెయింటెన్‌ చేయడానికి కొన్ని రకాల కూరగాయలని డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బ్రోకలీ

బ్రోకలీలో కెరోటినాయిడ్ అనే మూలకం ఉంటుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, కె వంటి పోషకాలు ఉంటాయి. దీంతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల బ్రకోలీని సూపర్‌ ఫుడ్‌ అని చెప్పవచ్చు.

క్యాబేజీ

క్యాబేజీలో విటమిన్ ఎ, బి, ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. క్యాబేజీలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పాలకూర

పాలకూర తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ అధిక శాతం ఉంటుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఆకలిని అదుపులో ఉంచుతుంది.

క్యాప్సికమ్

క్యాప్సికమ్‌లో పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి6, సి, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

కాలీఫ్లవర్

కాలీఫ్లవర్‌లో ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. సులువుగా బరువు తగ్గుతారు.

Tags:    

Similar News