Health Tips: జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి వీటిని తినండి.. పాత విషయాలు కూడా గుర్తుకొస్తాయి..!
Health Tips: నేటి కాలంలో చాలా మంది మతిమరుపుతో బాధపడుతున్నారు. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే ముందు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి.
Health Tips: నేటి కాలంలో చాలా మంది మతిమరుపుతో బాధపడుతున్నారు. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే ముందు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. డైట్‌లో మెమోరీని పెంచే ఆహారాలు ఉండే విధంగా చూసుకోవాలి. ఆహారం శరీరం, ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రతిరోజు తినాల్సిన కొన్ని ఫుడ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
తృణధాన్యాలు
అధిక ప్రోటీన్ కలిగిన తృణధాన్యాలు రోజూ తీసుకోవాలి. ఇందుకోసం ఎక్కువగా మిల్లెట్స్‌తో చేసిన ఆహారాలను తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్‌తో పాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం అలవాటు చేసుకోవాలి.
చేపలు
వారానికి ఒకసారి తప్పనిసరిగా చేపలను తినాలి. ఎందుకంటే వీటిని తినడం వల్ల బ్రెయిన్ షార్ప్‌గా తయారవుతుంది. చేపలలో విటమిన్ డి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును పదును పెట్టడంలో సహాయపడుతాయి. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బీన్స్ తినండి
ఆహారంలో బీన్స్, కాయధాన్యాలు, సోయాబీన్స్ ఉండేలా చూసుకోవాలి. బీన్స్‌లో పెద్ద మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. ఇవి మెదడుకు ఆరోగ్యకరం. బీన్స్‌ను వారానికి 4 సార్లు తినేలా చూసుకోవాలి.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్
ప్రతి వారం పచ్చి ఆకు కూరలు తినడం వల్ల మెదడుకు పదును పెరుగుతుంది. దీని కోసం పాలకూర, బ్రోకలీ, ఆకుకూరలు తినాలి. ఆకు కూరలను ఖచ్చితంగా తినడం అలవాటు చేసుకోవాలి.
నట్స్
ప్రతిరోజు ఏవైనా గింజలు తింటే మెదడు ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే వీటిలో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. గింజల వినియోగం మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.