Poppy Seeds: గసగసాలు గట్టిగా తినండి.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Poppy Seeds: గసగసాలు గట్టిగా తినండి.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Update: 2023-05-28 03:30 GMT

Poppy Seeds: గసగసాలు గట్టిగా తినండి.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Poppy Seeds: వేసవిలో గసగసాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ఇవి చల్లటి గుణాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఐరన్, కాపర్, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు ఉన్నాయి. గసగసాలు తినడం వల్ల పొట్టకు చల్లదనం చేకూరుతుంది. ఇది ఎసిడిటీ, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం అందిస్తుంది. గసగసాలు తినడం వల్ల శరీరంలో రక్తం కొరత తీరుతుంది. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి. వేసవిలో తినడం వల్ల శరీరానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు కలుగుతాయి. గసగసాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

కడుపుకు మంచిది

గసగసాలు చల్లటి గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల కడుపు చల్లగా ఉంటుంది. ఈ గింజలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు పని చేస్తాయి. దీంతో పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేసుకోవచ్చు. గసగసాలు మిమ్మల్ని చాలా రిలాక్స్‌గా చేస్తాయి.

ఆమ్లత్వం

వేసవిలో ఈ గింజలను తింటే ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులో మంటతో పాటు గుండెల్లో మంట తగ్గుతుంది. ప్రతిరోజూ ఉదయం పాలలో గసగసాలు కలిపి తీసుకోవచ్చు. ఇది ఎసిడిటీ లక్షణాలను తగ్గించడానికి పనిచేస్తుంది.

జీర్ణక్రియ

ఈ విత్తనాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గసగసాలు మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ గింజల్లో పీచు అధిక పరిమాణంలో ఉంటుంది. జీర్ణక్రియకు సంబంధించిన అనేక ఇతర సమస్యలను తొలగించడానికి ఇవి పనిచేస్తాయి.

ఒత్తిడి

గసగసాలు ఒత్తిడిని తగ్గించడానికి పని చేస్తాయి. మీరు తరచుగా ఒత్తిడికి గురైనట్లయితే గసగసాలు తినవచ్చు. వీటివల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.

రక్తపోటు

గసగసాలలో ఒలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. గసగసాలలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గసగసాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

Tags:    

Similar News