Health Tips: గుడ్డు ఒక సూపర్‌ ఫుడ్‌.. ప్రతి రోజు తింటే ఈ సమస్యకి చెక్..!

Health Tips: గుడ్డు ఒక సూపర్ ఫుడ్‌. చాలామంది ప్రొటీన్‌ కోసం గుడ్డుని తింటారు. కానీ దీనివల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Update: 2023-09-12 01:30 GMT

Health Tips: గుడ్డు ఒక సూపర్‌ ఫుడ్‌.. ప్రతి రోజు తింటే ఈ సమస్యకి చెక్..!

Health Tips: గుడ్డు ఒక సూపర్ ఫుడ్‌. చాలామంది ప్రొటీన్‌ కోసం గుడ్డుని తింటారు. కానీ దీనివల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తవానికి మానసిక ఆరోగ్యం బాగుండాలంటే సెరోటోనిన్‌ను పెంచే ఆహారాలను తినాలి. దీనినే హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది మానసిక స్థితి, నిద్ర, ఆకలి, జ్ఞాపకశక్తి సంబంధిత విధులను కంట్రోల్‌ చేయడానికి పనిచేస్తుంది. ఇది గుడ్డులో పుష్కలంగా లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

గుడ్డు

గుడ్డును ఒక సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ప్రోటీన్ అవసరాలు తీర్చడానికి గుడ్డుని తీసుకుంటారు. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడులో న్యూరోట్రాన్స్మిటర్‌గా పనిచేస్తుంది. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. తరచుగా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే ప్రతిరోజూ 2 గుడ్లు తినాలి. దీనివల్ల ఒత్తిడి దూరమై సంతోషంగా ఉంటారు.

వాల్‌నట్

వాల్‌నట్ ఒక అద్భుతమైన డ్రై ఫ్రూట్. ఇందులో పోషకాల కొరత ఉండదు. చాలా మంది డైటీషియన్లు మంచి ఆరోగ్యం కోసం దీనిని తినాలని సూచిస్తారు. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు చాలా అవసరం. ఇది శరీరంలో ఉత్పత్తి కాదు. ఆహారం ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ పరిమిత పరిమాణంలో తింటే డిప్రెషన్‌ను నివారించవచ్చు.

బాదంపప్పులు

వాల్‌నట్‌ల మాదిరిగానే బాదంపప్పు కూడా ఒక డ్రై ఫ్రూట్. దీనిని ఎండబెట్టి నానబెట్టి తినాలి. దీనివల్ల మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది శక్తిని ఇవ్వడమే కాకుండా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఫ్యాటీ ఫిష్

నాన్ వెజ్ ఫుడ్‌ను ఇష్టపడేవారు సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు చేపలను తినాలి. వీటిలో విటమిన్ డి ఉంటుంది. ఇది డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. శరీరానికి ఒమేగాను అందిస్తుంది.

Tags:    

Similar News