Health Tips: రాత్రిపూట బెల్లం కలిపిన పాలు తాగితే అద్భుత ఫలితాలు.. అవేంటంటే..?
* మీరు పాలను తియ్యగా మార్చడానికి చక్కెరను కలిపితే అది హాని కలిగిస్తుంది. పంచదారకు బదులు బెల్లం వాడితే మంచి ఫలితాలు లభిస్తాయి.
Health Tips: పాలను సంపూర్ణ ఆహారం అంటారు. చక్కెర కలిపిన పాలు తాగడం చాలామందికి ఇష్టం. అయితే కొంతమంది సాధారణ పాలు తాగడానికి ఇష్టపడతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణ పాలను ఉపయోగించే వ్యక్తులకు మలబద్ధకం లేదా గ్యాస్ సమస్యలు ఏర్పడుతాయి. ఇది కాకుండా తీపి పాలు శరీరానికి మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ మీరు పాలను తియ్యగా మార్చడానికి చక్కెరను కలిపితే అది హాని కలిగిస్తుంది. పంచదారకు బదులు బెల్లం వాడితే మంచి ఫలితాలు లభిస్తాయి.
1. తరచూ అలసటగా, బలహీనంగా అనిపిస్తే పాలలో బెల్లం కలుపుకుని తాగితే మంచిది. ఇందులో ఉండే క్యాల్షియం శరీరంలోని బలహీనతను దూరం చేస్తుంది. దీంతో పనిచేసేటప్పుడు అలసట అనిపించదు.
2. పాలు, బెల్లం చెడు జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. ఇది కడుపులో జీవక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒక గ్లాసు పాలలో బెల్లం కలిపి తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట, మలబద్ధకం వంటి అనేక కడుపు సమస్యలు దూరమవుతాయి.
3. చలికాలంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. ఈ సమయంలో బెల్లం పాలు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, డి, జింక్, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తాయి. చాలా మందికి రాత్రిపూట నిద్రపట్టకపోవడం అనే సమస్య ఉంటుంది. ఈ పరిస్థితిలో బెల్లం పాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.