Health Tips: శీతాకాలంలో బీట్‌రూట్‌, క్యారెట్‌ జ్యూస్‌ తాగండి.. శరీరానికి అద్భుత ప్రయోజనాలు..!

Health Tips: శీతాకాలం వచ్చేసింది. దీంతో పాటు సీజనల్‌ వ్యాధులు కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది.

Update: 2023-11-01 16:00 GMT

Health Tips: శీతాకాలంలో బీట్‌రూట్‌, క్యారెట్‌ జ్యూస్‌ తాగండి.. శరీరానికి అద్భుత ప్రయోజనాలు..!

Health Tips: శీతాకాలం వచ్చేసింది. దీంతో పాటు సీజనల్‌ వ్యాధులు కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అందుకే ఆహారంపై దృష్టి పెట్టాలి. లేదంటే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం ప్రతిరోజు బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ తాగాలి. దీని వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చలికాలంలో బీట్‌రూట్‌, క్యారెట్‌ జ్యూస్‌ తాగడం వల్ల క్యాన్సర్‌ రాకుండా కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ జ్యూస్‌లో అనేక యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయి. అధిక బీపీతో బాధపడేవారు శీతాకాలంలో క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తాగడం మంచిది. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం కారణంగా రక్తపోటు సమతుల్యంగా ఉంటుంది.

ఊబకాయం సమస్య ఉన్నవారు రోజూ ఒక గ్లాసు బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ తాగాలి. ఫైబర్, తక్కువ కేలరీలు ఉండటం వల్ల శరీరం ఫిట్‌గా మారుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి బీట్‌రూట్, క్యారెట్ దివ్యౌషధమని చెప్పాలి. ఈ రెండింటిలోనూ ఐరన్ పుష్కలంగా లభించడం వల్ల శరీరంలో రక్తం ఏర్పడే వేగాన్ని పెంచుతుంది. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం క్యారెట్, బీట్‌రూట్‌లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి.

Tags:    

Similar News