Dengue Fever: డెంగ్యూ వచ్చినప్పుడు ఈ పొరపాట్లు చేయవద్దు.. ప్లేట్‌లెట్స్‌ సడెన్‌గా తగ్గుతాయి..!

Dengue Fever: ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. దీని కారణంగా ఆస్పత్రుల్లో రోగుల రద్దీ కూడా పెరుగుతోంది.

Update: 2023-11-03 14:30 GMT

Dengue Fever: డెంగ్యూ వచ్చినప్పుడు ఈ పొరపాట్లు చేయవద్దు.. ప్లేట్‌లెట్స్‌ సడెన్‌గా తగ్గుతాయి..!

Dengue Fever: ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. దీని కారణంగా ఆస్పత్రుల్లో రోగుల రద్దీ కూడా పెరుగుతోంది. అంతేకాదు ఈ జ్వరం కారణంగా కొందరు రోగులు కూడా మరణించారు. డెంగ్యూలో షాక్ సిండ్రోమ్, హెమరేజిక్ జ్వరం కారణంగా మరణించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో రోగి శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. 20 వేల లోపు ఉంటే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి పరిస్థితుల్లో డెంగ్యూ జ్వర పీడితులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

ఏడిస్ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ దోమ పగటిపూట కుడుతుంది. డెంగ్యూ జ్వరం వైరస్‌ల వల్ల వస్తుంది. చాలా సందర్భాలలో డెంగ్యూ జ్వరం మూడు నుంచి ఐదు రోజుల్లో నయమవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా మందులేమీ వాడనవసరం లేదు. కానీ డెంగ్యూ కారణంగా కొందరిలో ప్లేట్‌లెట్స్ పడిపోతాయి. రోగి అంతర్గత రక్తస్రావంతో బాధపడతాడు. ఈ సమస్య ఏ వయసులోనైనా రావచ్చు.

ఈ పొరపాట్లు చేయవద్దు

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు సొంతంగా ఎలాంటి మందులు తీసుకోవద్దని డాక్టర్లు చెబుతున్నారు. వైద్యుల సలహా లేకుండా ఏ మందులు వాడినా శరీరానికి హాని కలుగుతుంది. డెంగ్యూ సమయంలో ఎలాంటి ఇంటి నివారణలు పాటించవద్దు. ఇలా చేయడం వల్ల రోగి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. మేక పాలు లేదా బొప్పాయి ఆకు రసంతో డెంగ్యూ నయం అవుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో డెంగ్యూ జ్వరానికి స్వీయ చికిత్స చేయకుండా ఉండటం ముఖ్యం. జ్వరంతో పాటు వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పులు వంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

నీరు తాగడంఆపవద్దు

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు కొందరు నీరు తాగడం తగ్గిస్తారు. కానీ అలా చేయకూడదు. డెంగ్యూ సమయంలో రోజుకు కనీసం ఎనిమిది నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. డెంగ్యూ జ్వరం సమయంలో శరీరంలోని హెమటోక్రిట్‌పై దృష్టి పెట్టాలి. RBC 45 కంటే తక్కువ ఉండకూడదు. ఇంతకంటే తక్కువగా ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.

Tags:    

Similar News