Fridge Mistakes: ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు పెట్టినప్పుడు ఈ పొరపాట్లు చేయవద్దు.. అవేంటంటే..?

Fridge Mistakes: ఆహారపదార్థాలు, పండ్లు, కూరగాయలు పాడవకుండా చాలామంది వాటిని ఫ్రిజ్‌లో పెడుతారు.

Update: 2023-06-23 03:45 GMT

Fridge Mistakes: ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు పెట్టినప్పుడు ఈ పొరపాట్లు చేయవద్దు.. అవేంటంటే..?

Fridge Mistakes: ఆహారపదార్థాలు, పండ్లు, కూరగాయలు పాడవకుండా చాలామంది వాటిని ఫ్రిజ్‌లో పెడుతారు. దీనివల్ల అవి చాలాకాలం తాజాగా చల్లగా ఉంటాయి. అయితే ఇంట్లో ఫ్రిజ్‌ ఉన్నప్పుడు దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం. తరచుగా చేసే కొన్ని పొరపాట్ల వల్ల కొన్నిసార్లు ఫ్రిజ్‌ తన పని తాను చేయకుండా మొరాయిస్తుంది. తొందరగా పాడవుతుంది. అంతేకాదు దీనివల్ల అందులో పెట్టిన పదార్థాలు కూడా త్వరగా చల్లబడవు. ఇలాంటి సమయంలో ఈ విషయాలపై దృష్టి పెట్టండి.

టెంపరేచర్‌ 4°C నుంచి 5°C మధ్య సెట్ చేయండి

రిఫ్రిజిరేటర్‌ను అత్యంత శీతల ఉష్ణోగ్రతకు సెట్ చేయండి. ఇది మీ ఆహారాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది. సాధారణంగా 4°C నుంచి 5°C (40°F నుంచి 41°F) వరకు సురక్షితమైన, చల్లని ఉష్ణోగ్రతకి అనువైనదిగా చెప్పవచ్చు.

డోర్‌ తరచుగా తెరవవద్దు

ఫ్రిజ్‌ ఎప్పుడు చల్లగా ఉండాలంటే దాని డోర్‌ని తరచుగా తెరవవద్దు. పదే పదే ఫ్రిజ్ డోర్ తెరవడం వల్ల చల్లటి గాలి బయటకు వెళ్లి ఫ్రిజ్ సరిగా చల్లబడదు.

వెంటిలేషన్‌లో ఉంచండి

తరచుగా ప్రజలు ఫ్రిజ్‌ను గోడకు ఆనుకొని పెడుతారు. ఇది సరైనది కాదు. గోడ, ఫ్రిజ్ మధ్య కొద్దిగా గ్యాప్‌ ఉండాలి. దీని వల్ల ఫ్రిజ్ నుంచి వెలువడే వేడి సులభంగా బయటకు వెళ్లిపోతుంది. గోడని ఆనుకుని ఉంటే రిఫ్రిజిరేటర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.

ఎల్లప్పుడు నిండుగా ఉండాలి

రిఫ్రిజిరేటర్‌లో ఎప్పుడు ఆహారపదార్థాలు, కూరగాయలతో నిండుగా ఉంచండి. తద్వారా చల్లదనం బయటికి వెళ్లదు. ఫ్రిజ్‌ని ఖాళీగా ఉంచడం వల్ల చల్లదనం అనేది స్టోర్‌ అవదు. పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది.

రెగ్యులర్ క్లీనింగ్

ఫ్రిజ్‌ని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. తద్వారా అది సరిగ్గా పని చేస్తుంది. ఒకదానికొకటి సంబంధం ఉన్న భాగాలను కూడా శుభ్రం చేయాలి. దీని కారణంగా రిఫ్రిజిరేటర్ తొందరగా పదార్థాలని చల్లబరుస్తుంది.

Tags:    

Similar News