Chest Pain: ఛాతి నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు.. ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే..!

Chest Pain: చాలామంది ఛాతినొప్పిని తేలికగా తీసుకుంటారు. తరచుగా నొప్పి వస్తున్నప్పటికీ వైద్యుడి దగ్గరికి వెళ్లరు.

Update: 2023-07-19 14:30 GMT

Chest Pain: ఛాతి నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు.. ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే..!

Chest Pain: చాలామంది ఛాతినొప్పిని తేలికగా తీసుకుంటారు. తరచుగా నొప్పి వస్తున్నప్పటికీ వైద్యుడి దగ్గరికి వెళ్లరు. సాధారణ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కండరాలలో ఒత్తిడి వల్ల ఛాతీలో బరువుగా ఉంటుంది. అయితే కొన్ని ఇతర వ్యాధుల కారణంగా కూడా ఛాతీలో నొప్పి ఏర్పడుతుంది. కానీ ఈ సమస్య నిరంతరంగా ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతినొప్పికి గల కారణాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

కరోనరీ ఆర్టరీ వ్యాధి

కరోనరీ ఆర్టరీ వ్యాధిలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతింటాయి. ధమనులలో చెడు కొలస్ట్రాల్‌ పేరుకుపోవడం వల్ల ఛాతీలో నొప్పి మొదలవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఈ నొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే డాక్టర్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్

కొన్నిసార్లు గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ కారణంగా ఛాతీలో నొప్పి వస్తుంది. దీనికి కారణం కడుపులో యాసిడ్స్‌ ఏర్పడటం వల్ల జరుగుతుంది. ఈ పరిస్థితిలో ఛాతీలో మంట, ఛాతీ నొప్పి వస్తాయి. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

న్యుమోనియా

న్యుమోనియా అనేది ఊపిరితిత్తులలో వచ్చే ఇన్ఫెక్షన్. దీనివల్ల గాలి సంచిలో చీము లేదా ద్రవం ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఛాతీలో నొప్పి, అలసట వంటి సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి ఛాతీలో బరువుగా ఉన్నట్లు అనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి.

Tags:    

Similar News