Health Tips: ఇవి తిన్నాక పొరపాటున కూడా పాలు తాగవద్దు.. చాలా ప్రమాదం..!
Health Tips: పాలు సంపూర్ణ ఆహారం. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు తాగడం వల్ల ఎముకలు గట్టిపడుతాయి.
Health Tips: పాలు సంపూర్ణ ఆహారం. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు తాగడం వల్ల ఎముకలు గట్టిపడుతాయి. పాలని వేడిగా, చల్లగా రెండు విధాలుగా తాగవచ్చు. ఈ రెండు సందర్భాల్లోను శరీరానికి కావాల్సిన ప్రయోజనాలు అందుతాయి. కానీ కొన్నిరకాల ఆహారాలు తిన్న తర్వాత పాలు అస్సలు తాగకూడదు. దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. అలా పాలతో కలిపి తినకూడని ఆహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పాలతో పాటు టమోటాలు
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం పాలతో పాటు టమోటాలు ఎప్పుడు తినవద్దు. అలాగే టమోట కూర, పచ్చడి తిన్నాక కూడ పాలు తాగవద్దు. ఎందుకంటే టమోట ఒక ఆమ్లం. పాలు తాగినప్పుడు కడుపులో రసాయన చర్య జరుగుతుంది. దీని కారణంగా వాంతులు, విరేచనాలు ఏర్పడుతాయి.
మసాలాతో కూడిన పాలు
మసాలతో కూడిన పాలు ఎప్పుడు తాగవద్దు. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం. ఈ కలయిక హార్మోన్లకు సరైనది కాదు. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట మొదలైన సమస్యలు ఏర్పడుతాయి.
పచ్చళ్లతో పాలు
రొట్టె లేదా అన్నం పచ్చడితో తిన్నప్పుడు పాలు తాగవద్దు. ఊరగాయలు, పాలు విరుద్దమైన చర్య జరుపుతాయి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. చాలా రోజులు కడుపు సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది.
పండ్లు తిన్న తర్వాత పాలు
పండ్లు తిన్న తర్వాత పాలు తాగకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ చెదిరిపోతుంది. వాంతులు, విరేచనాలు ఇబ్బంది పెడుతాయి. అందుకే ఈ కాంబినేషన్‌లో ఎప్పుడు పాలు తాగకూడదని గుర్తుంచుకోండి.