Kidney Stones: అసలు కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడుతాయో తెలుసా.?
Kidney Stones: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.
Kidney Stones: కిడ్నీల్లో రాళ్లు సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది ఈ సమస్య బారిన పడే ఉంటారు. శరీరంలో కీలక పాత్ర పోషించే కిడ్నీల్లో ఏర్పడే ఈ సమస్య ఎన్నో ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యం కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే కిడ్నీల్లో రాళ్లు ఎందుకు ఏర్పడుతాయని ఎప్పుడైనా ఆలోచించారా.? అసలు కిడ్నీల్లో రాళ్ల సమస్యకు కారణం ఏంటి.? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. తినే ఆహారం, ద్రవాలు ఫిల్టర్ అయ్యేది ఇక్కడే. ఇదే లేకుంటే మనిషి మొత్తం విషపూరితమౌతాడు. ఎప్పటికప్పుడు విష పదార్ధాలను బయటకు తొలగించేది కిడ్నీలే. తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే.. అందులోని మినరల్స్, ఉప్పు కిడ్నీలో పేరుకుపోయి చిన్న చిన్న కణాల నుంచి పెద్ద పెద్ద రాళ్లుగా మారిపోతాయి. మూత్రంలో మినరల్స్ కాన్సంట్రేషన్ అధికమైనప్పుడు ఈ పరిస్తితి ఏర్పడుతుంది.
కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు రాళ్లుగా మారుతుంటాయి. సాధారణంగా నీళ్లు తక్కువగా తీసుకునే వారిలో ఈ సమస్య ఎదురవుతుంది. నీరు తక్కువగా తాగితే.. శరీరంలో నీటి కొరత ఉంటే యూరిన్ పరిమాణం తగ్గిపోతుంది. ఈ కారణంగానే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి. అయితే సమస్యను ముందుగా గుర్తించే ట్యాబ్లెట్స్‌ను వాడితే సమస్య నుంచి బయటపడొచ్చు. లేదంటే రాళ్ల పరిమాణం పెరిగే సర్జరీ చేయాల్సి ఉంఉటంది.
ఇక కిడ్నీలో రాళ్ల సమస్య రాకుండా ఉండాలంటే జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిత్యం తగినంత నీటిని తీసుకోవాలి. సరిపడ నీటిని తాగితే.. యూరిన్ లో ఉండే మినరల్స్, ఉప్పను పల్చగా మార్చవచ్చు. దీంతో రాళ్లు ఏర్పడే సమస్య తగ్గుతంఉది. రోజు క్రమం తప్పకుండా 8-10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి.