Midnight Hungry: అర్దరాత్రి విపరీతమైన ఆకలి వేస్తుందా.. కారణాలు ఇవే..!
Midnight Hungry: రాత్రిపూట తిన్నప్పటికీ మళ్లీ కొంత సమయానికి ఆకలిగా ఉంటుంది
Midnight Hungry: కొంతమందికి అర్దరాత్రి విపరీతమైన ఆకలి వేస్తుంది. రాత్రిపూట తిన్నప్పటికీ మళ్లీ కొంత సమయానికి ఆకలిగా ఉంటుంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు ఇలాంటి లక్షణాలని కలిగి ఉంటారు. ఇంకొందరు వారు రోజు మొత్తంలో చేసే తప్పుల వల్ల ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటారు. అర్దరాత్రి ఆకలికి గల కారణాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
అల్పాహారం తినకపోవడం ఉదయం పూట ప్రతి ఒక్కరు టిఫిన్ తినాలి. ఇది ఒక విధంగా రోజంతా శరీరానికి ఇంధనంగా ఉంటుంది. మీరు ఉదయం సరైన సమయానికి సరైన అల్పాహారం తీసుకోకపోతే ఇన్సులిన్ విషయంలో మార్పులు సంభవిస్తాయి.
ఒత్తిడి కారణం:
పగటిపూట పనిచేస్తూ ఒత్తిడికి గురయ్యే వ్యక్తులు రాత్రిపూట తినాలనే కోరికలకు కలిగి ఉంటారు. ఒత్తిడి శరీరంలో కార్టిసాల్ స్థాయిని పెంచుతుంది. దీని కారణంగా ఇన్సులిన్ మార్పులు సంభవిస్తాయి. ఇది అతిగా తినడానికి కారణం అవుతుంది.
ప్రోటీన్ లోపం:
తగినంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. పదే పదే ఆకలి అనిపించదు. అయితే ఆహారంలో తక్కువ ప్రోటీన్ ఉంటే రాత్రిపూట ఆకలితో బాధపడే అవకాశం ఉంటుంది. ఆపై అనారోగ్యకరమైన ఆహారం తినాల్సి వస్తుంది.
తక్కువ నీరు:
ఆకలిని అదుపులో ఉంచుకోవడానికి తగినంత నీరు తాగడం అవసరం. కొంతమంది నీటిని మానేసి శీతల పానీయాలను ఆశ్రయిస్తారు. దీని కారణంగా శరీరానికి తగినంత హైడ్రేషన్ లభించదు. దీంతో ఎక్కవగా తినాలనే కోరిక కలుగుతుంది.
పిండి పదార్థాలు:
పిండి పదార్థాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. దీని కారణంగా కడుపు నిండిన భావన ఉండదు. దీంతో పదే పదే ఆకలిగా ఉంటుంది.