Tomatoes Disadvantages: ప్రతిరోజు టమోట తింటున్నారా.. అయితే ఈ సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు..!
Tomatoes Disadvantages: ప్రతిరోజు టమోట తింటున్నారా.. అయితే ఈ సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు..!
Tomatoes Disadvantages: కొంతమంది టమోటాలు తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కానీ టొమాటోలు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. టమోటాలు తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం.
అసిడిటీ సమస్య
టొమాటో ఎక్కువగా తినడం వల్ల కడుపులో ఎసిడిటీ సమస్య ఏర్పడుతుంది. ఇప్పటికే ఎసిడిటీ సమస్య ఉన్నవారు వీటిని ఎక్కువగా తినకూడదు.
రాళ్ల సమస్యలు
టమోటాలు అధికంగా తీసుకోవడం వల్ల రాళ్ల సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే టొమాటోలో ఉండే గింజలు సులభంగా కిడ్నీకి చేరి రాళ్లు తయారవుతాయి. అందుకే టమోటాలు ఎక్కువగా తీసుకోకూడదు.
గుండెల్లో మంట
టొమాటోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట సమస్య మొదలవుతుంది. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల గ్యాస్ సమస్యలు, గుండెల్లో మంట సమస్య పెరుగుతాయి.
శరీర దుర్వాసన
టొమాటోలు ఎక్కువగా తినడం వల్ల శరీర దుర్వాసన సమస్య పెరుగుతుంది. ఎందుకంటే టొమాటోలో టెర్పెనెస్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో చెడు వాసన సమస్యను పెంచుతుంది.
కీళ్ల నొప్పి
టమోటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. ఎందుకంటే టొమాటోలో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. దీని కారణంగా కీళ్లలో వాపు సమస్య ఏర్పడుతుంది.