Digestive Tablet Side Effects: డైజెస్టివ్ టాబ్లెట్ వేసుకుంటారా.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెలిస్తే ఈ తప్పు చేయరు..!

Digestive Tablet Side Effects: కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఆహారం జీర్ణం కావడానికి ట్యాబ్లెట్లు వాడుతుంటారు.

Update: 2023-08-21 15:30 GMT

Digestive Tablet Side Effects: డైజెస్టివ్ టాబ్లెట్ వేసుకుంటారా.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెలిస్తే ఈ తప్పు చేయరు..!

Digestive Tablet Side Effects: కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఆహారం జీర్ణం కావడానికి ట్యాబ్లెట్లు వాడుతుంటారు. కానీ ఇది అస్సలు మంచి పద్దతి కాదు. ఇంట్లో ఫంక్షన్లు, శుభకార్యాలు అయినప్పుడు హెవీ ఫుడ్‌ తీసుకుంటారు. దీనివల్ల ఆహారం తొందరగా జీర్ణం కాదు. దీంతో చాలా ఇబ్బందులు పడుతారు. ఈ సమయంలో చాలామంది ట్యాబ్లెట్లపై ఆధారపడుతున్నారు. ఎక్కువసార్లు ఇలా చేయడం వల్ల చాలా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

అజీర్ణం

జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు డైజెస్టివ్ ట్యాబ్లెట్లను తీసుకున్నప్పటికీ అతిగా తీసుకుంటే అజీర్ణం, గ్యాస్, అల్సర్ అనేక ఇతర సమస్యలు ఎదురవుతాయి.

పోషకాహార లోపం

జీర్ణక్రియకు సంబంధించిన మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ దెబ్బతింటుంది. ఇది పోషకాహార లోపానికి దారితీస్తుంది. శరీరంలో బలహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

టాక్సిన్స్ పేరుకుపోతాయి

డాక్టర్ సిఫారసు లేకుండా అధిక డైజెస్టివ్ టాబ్లెట్లను తీసుకుంటే శరీరంలో అనవసరంగా విషపూరిత పదార్థాలు పేరుకుపోతాయి. ఇవి అనేక ఇతర సమస్యలను కలిగిస్తాయి.

వాంతులు

అధికంగా జీర్ణక్రియకు సంబంధించిన మాత్రలు తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు ఏర్పడుతాయి. దీని కారణంగా మానవ శరీరం క్రమంగా బలహీనపడుతుంది. కాబట్టి జాగ్రత్త అవసరం.

అలవాటు పడితే చాలా నష్టం

ప్రతిసారి ఆహారం జీర్ణం కావడానికి మాత్రలపై ఆధారపడితే కొన్ని రోజులకి అవి లేకుండా ఆహారం జీర్ణం అవడం కష్టమవుతుంది. జీర్ణక్రియ కోసం మందులపై ఆధారపడవద్దు. సహజసిద్దంగా ఆహారం జీర్ణం అయ్యేలా కొన్ని పద్దతులని పాటించాలి.

Tags:    

Similar News