Brushing Mistakes: బ్రష్ చేసేముందు ఈ చిన్నపని చేస్తున్నారా.. లేదంటే పళ్లు దెబ్బతినడం ఖాయం..!
Brushing Mistakes: నోటిలో ఉండే దంతాలు అందరికి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి లేకుంటే ఆహారం నమిలడం చాలా కష్టమవుతుంది.
Brushing Mistakes: నోటిలో ఉండే దంతాలు అందరికి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి లేకుంటే ఆహారం నమిలడం చాలా కష్టమవుతుంది. అందుకే అందరు ఉదయం పూట నిద్రలేవగానే బ్రష్ చేయడం అలవాటు చేసుకుంటారు. కొంతమంది దంతాల శుభ్రత కోసం రోజుకి రెండుసార్లు బ్రష్ చేస్తారు. కానీ కొంతమంది చిన్న పనిని విస్మరిస్తారు. బ్రష్ చేయడానికి మొదట బ్రష్‌పై నీటిని పోసి ఆపై టూత్‌పేస్ట్‌ను పెట్టుకుంటారు. మరికొందరు ముందుగా పేస్ట్‌ను పెట్టుకొని ఆపై కొంచెం నీరు చల్లుకుంటారు. ఈ రెండిటిలో ఏది చేసినా పర్వాలేదు కానీ బ్రస్ చేసేముందు అసలే నీరు చల్లుకోకుండా ఇబ్బంది ఏర్పడుతుంది.
బ్రష్ తడిగా ఉందా లేదా?
దంత నిపుణుల అభిప్రాయం ప్రకారం దంతాలను ఏ విధంగానైనా శుభ్రం చేసుకోవచ్చు. కావాలంటే బ్రష్‌ను తడి చేయకుండా బ్రషింగ్ చేయవచ్చు. అయితే పొడి బ్రష్‌కు టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి దంతాలను శుభ్రం చేస్తే తక్కువ నురుగు వస్తుంది. దీని కారణంగా బ్రష్ చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. నీటితో తడిపడం వల్ల నురుగు ఏర్పడి బ్రషింగ్ సులువుగా జరుగుతుంది.
పంటి నొప్పికి కారణం
ఈ నీటితో బ్రష్ తడపడం అనేది వినడానికి సిల్లీ మ్యాటర్‌లా అనిపించినా దీనివల్ల దంతాలకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్రష్‌పై నీరు చల్లుకోపోతే బ్రష్ బ్రిస్టల్స్ గట్టిగా ఉండి రాపిడిని పెంచుతాయి. ఇది చిగుళ్ళు, పంటి నొప్పికి దారి తీస్తుంది. అందుకే నీరు తడిపిన తర్వాత బ్రష్‌ను వాడితే మేలు జరుగుతుందని వైద్యుల అభిప్రాయం.
ఫిట్ దంతాలు
దంతాలు శుభ్రంగా ఉండాలంటే కేవలం పళ్లు తోముకుంటే సరిపోదు. దీని కోసం చాలా విషయాలపై శ్రద్ధ వహించాలి. మొదటి విషయం ఏంటంటే ఏదైనా తినడం లేదా తాగిన వెంటనే నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. రెండవది వీలైనంత వరకు శీతల పానీయాలు, జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. ఇవి దంతాలకి హాని కలిగిస్తాయని గుర్తుంచుకోండి.