Health Tips: వ్యాయామం తర్వాత నీరు తాగుతున్నారా.. తీవ్ర సమస్యలని ఎదుర్కొంటారు..!
Health Tips: మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిండి ఉంటుంది.
Health Tips: మన శరీరంలో ఎక్కువ భాగం నీటితో నిండి ఉంటుంది. ఇది లేకుంటే మనిషి బతకడం చాలా కష్టం. శరీరంలో సరిపడా నీరు లేనప్పుడు వివిధ రకాల నొప్పులు మొదలవుతాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని సూచిస్తారు. అయితే కొంతమంది జిమ్‌లో వ్యాయామం చేసిన వెంటనే నీళ్లు తాగుతారు. కానీ ఇది మంచి పద్దతి కాదు. దీనివల్ల చాలా సమస్యలని ఎదుర్కోవాల్పి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.
జిమ్‌లో చెమటలు పట్టినప్పుడు నీళ్లు తాగాలని అనిపిస్తుంటుంది. కానీ అస్సలు తాగకూడదు. విరామం సమయంలో మాత్రమే నీరు తాగాలని గుర్తుంచుకోండి. అది కూడా గుండె వేగం తక్కువయ్యాక నీటిని ఒకేసారి కాకుండా నెమ్మదిగా చిన్న చిన్న సిప్స్ ద్వారా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యానికి మంచిది. లేదంటే చాలా సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే జిమ్ చేసిన వెంటనే శరీరం వేడిగా తయారవుతుంది. వెంటనే నీరు తాగితే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
1. వ్యాయామం తర్వాత శరీరానికి కొంత విశ్రాంతి ఇవ్వండి. చెమట పట్టినప్పుడు, గుండె కొట్టుకోవడం సాధారణమైనప్పుడు మాత్రమే నీరు తాగాలి.
2. అదేవిధంగా నీరు పైకి లేపి ఒకేసారి తాగకూడదు.
3. హాయిగా కూర్చొని తాగాలి. దీనివల్ల అది శరీరంలోని చాలా భాగాలకు చేరుతుంది.
4. జిమ్ తర్వాత సాధారణ నీరు మాత్రమే తాగాలి. ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని నీరు తాగకూడదు.
5. నీళ్లలో నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపి తాగాలి. దీనివల్ల చెమట కారణంగా కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది.