Sugarcane Juice: ఈ సమస్యలుంటే చెరకు రసం అస్సలు తాగవద్దు.. చాలా ఇబ్బందులు..!
Sugarcane Juice: చెరకురసం సహజసిద్దమైన పానీయం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని అన్ని కాలాలలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
Sugarcane Juice: చెరకురసం సహజసిద్దమైన పానీయం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని అన్ని కాలాలలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చెరకు రసంలో శరీరానికి అవసరమయ్యే కాల్షియం, కాపర్, ఐరన్ ఉంటాయి. ఇవి శరీరంలోని రక్తహీనతని తొలగిస్తాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు చెరుకు రసం తాగకూడదు. ఏయే వ్యక్తులు చెరుకు రసం తాగకూడదో ఈరోజు తెలుసుకుందాం.
మధుమేహం
చెరకు రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు హాని కలిగిస్తుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు పొరపాటున కూడా చెరుకు రసం తాగకూడదు.
పుచ్చు సమస్య
దంతాలలో పుచ్చు సమస్య ఉన్నవారు చెరుకు రసం తాగకూడదు. ఇది దంతాలకు హాని కలిగించే సహజ చక్కెరను కలిగి ఉంటుంది. అందుకే దంతాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు చెరుకు రసం తాగకూడదు.
కడుపు నొప్పి
మీకు కడుపు సమస్య ఉంటే చెరుకు రసం తాగకూడదు. ఎందుకంటే కడుపులో ఇబ్బంది ఉన్నప్పుడు జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే చెరకు రసం తాగితే సమస్యలు మరింత పెరుగుతాయి. అందుకే కడుపు నొప్పి వచ్చినప్పుడు చెరుకు రసం తాగకూడదు.
జలుబు, దగ్గు
చెరకు రసం చల్లటి గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి జలుబు సమస్య ఉంటే చెరకు రసం తాగడం మానుకోవాలి. లేదంటే జలుబు సమస్య మరింత పెరుగుతుంది. దగ్గు సమస్య ఉన్నప్పుడు కూడా చెరకు రసం తాగడం మానుకోవాలి.