Milk: పాలు సంపూర్ణ ఆహారమే కానీ వీరు మినహాయించాల్సిందే..!
Milk: పాలు సంపూర్ణ ఆహారమే కానీ వీరు మినహాయించాల్సిందే..!
Milk: ప్రతిరోజు పాలు తాగడానికి ఎంతోమంది ఇష్టపడుతారు. ఎందుకంటే పాలు సంపూర్ణ ఆహారం. పాలలో అనేక పోషకాలు ఉంటాయి. అల్పాహారంలో చేర్చుకుంటే అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. పాలు ఎముకలను బలంగా చేస్తుంది, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ప్రోటీన్లు, విటమిన్లు వంటి అనేక పోషకాలని అందిస్తుంది. అయితే పాలు తాగే విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆవు పాలు తాగడానికి సరైన సమయం రాత్రి అని ఆయుర్వేదం చెబుతోంది. ఎందుకంటే పాలలో నిద్రను కలిగించే గుణాలు ఉంటాయి. అందుకే ఉదయం తాగాలని చెప్పలేదు. కానీ సైన్స్ ప్రకారం పాలు తాగడం అనేది మీ ఆరోగ్యం, జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే పాలు తాగడం వల్ల తొందరగా జీర్ణంకావు. కాసింత సమయం పడుతుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఉదయం పాలు తాగిన తర్వాత రోజంతా బరువుగా ఉన్నట్లు ఫీలవుతారు.
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే రాత్రంతా కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి అనిపించదు. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగడం వల్ల మనస్సు రిలాక్స్‌గా ఉంటుంది. శరీర కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. కానీ పాలను జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉన్నవారు రాత్రిపూట పాలు తాగడం మానుకోవాలి. అంతే కాదు మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా తర్వాతే పాలు తాగాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాలు ఎప్పుడు తాగాలనేదానిపై ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ బరువు తగ్గాలనుకుంటే లేదా కండరాలు బలంగా ఉండాలనుకుంటే వ్యాయామం చేసిన తర్వాత తాగడం ఉత్తమం.