Diabetes Pills: డయాబెటీస్ పేషెంట్లకి అలర్ట్.. మాత్రల విషయంలో ఈ పొరపాటు చేయవద్దు..!
Diabetes Pills: దేశంలో మధుమేహ బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. దీనికి కారణం సరైన జీవనశైలి అనుసరించకపోవడమే.
Diabetes Pills: దేశంలో మధుమేహ బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. దీనికి కారణం సరైన జీవనశైలి అనుసరించకపోవడమే. డయాబెటీస్ వల్ల శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతింటున్నాయి. దీంతో చాలా వ్యాధులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మధుమేహ బాధితులలో కిడ్నీలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి ఇద్దరు మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఒకరికి కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నిరంతరం మాత్రలు వేసుకోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుందని అందరు అనుకుంటున్నారు. దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
డయాబెటీస్ మాత్రలు కిడ్నీలని ప్రభావితం చేయగలవా..?
కొన్ని మాత్రల వల్ల శరీరంపై దుష్ప్రభావాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అధిక మోతాదు గల యాంటీబయాటిక్ మందులు, యాంటీవైరల్ మందులు, యాంటీబయాటిక్స్ మందులు శరీర అవయవాలపై కిడ్నీలపై అధిక ప్రభావం చూపుతాయి. అందుకే వైద్యులు అత్యంత జాగ్రత్తగా మందులు రాస్తారు. వారు చెప్పిన డోసు ప్రకారమే వాటిని వేసుకోవాలి. అప్పుడు ఎటువంటి హాని ఉండదు. కానీ దీర్ఘకాలిక వాడకం దుష్ప్రభావాలకు కారణం అవుతుంది.
వైద్యులు సాధారణంగా రాసే కొన్ని మందులలో నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అని పిలువబడే నొప్పి నివారణలు ఉంటాయి. ఇవి చేతి నొప్పి, కాళ్ల నొప్పులు, తుంటి నొప్పికి వాడుతారు. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీపై ప్రభావం పడుతుంది. అదేవిధంగా కొన్ని క్యాన్సర్ నిరోధక మందులు, రక్త సంబంధిత సమస్యలకు తీసుకునే కొన్ని మందులు కిడ్నీ సమస్యలకు కారణం అవుతాయి. షుగర్ మాత్రలు ఖచ్చితంగా కిడ్నీపై ప్రభావం చూపవు. అనేక దశల పరిశోధన తర్వాత మందులు కనిపెడతారు. సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆరాతీస్తారు. ఆ తర్వాతనే వాటిని మార్కెట్‌లోకి తీసుకొస్తారు.