Daughters Day 2024: కూతురు వస్తువు కాదు.. మీ రక్తం..మనకెంతో అపురూపం

Daughters Day 2024: ప్రతిసంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం రోజు మన దేశంలో జాతీయ కూతుళ్ల దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటాం. ఇంట్లో పుట్టిన ఆడపిల్లలను కాపాడుకోమని చెప్పేందుకు ఈ ప్రత్యేక దినోత్సవం. కూతరు అంటే భారం కాదని..కూతురంటే భరోసా అని తెలిపేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Update: 2024-09-22 04:54 GMT

 Daughters Day 2024: కూతురు వస్తువు కాదు.. మీ రక్తం..మనకెంతో అపురూపం

Daughters Day 2024: ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఇంటి అందమే వేరు. ఆడపిల్ల ఇంట్లో నడుస్తే అచ్చం లక్ష్మీదేవి నడిచివచ్చినట్లే అనిపిస్తుంది. గుండె లోతుల్లో ఎన్ని బాధలు ఉన్నా..చిట్టి తల్లి ముఖంలో చిరునవ్వు చూడగానే..ఆ బాధలన్నీ ఆవిరైపోతాయి. అలాంటి ఆడపిల్ల పురాతన కాలంలో ఎన్నో అవమానాలు భరించింది. ఇంట్లో అబ్బాయిల కంటే ఆడపిల్లలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.ఇప్పటికీ ఆడపిల్లలను తక్కువగా చూసే సంప్రదాయం కొనసాగుతుంది. ఆడపిల్ల ఇప్పటీక చీత్కారానికి గురవుతుంది. కొడుకులకు దక్కుతున్న గౌరవం, మర్యాదలు కూతుళ్లకు దక్కడం లేదు. కొడుకులను ఉన్నత చదువులు చదిపిస్తే కూతురును పాచి పనులు చేపించే వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో మార్పు తీసుకురావాడానికి ఈ ప్రత్యేకమైన దినోత్సవం.

ఆడపిల్ల అంటే ఆడ పిల్ల..మన ఇంటి పిల్ల కాదనే అభిప్రాయం ఎంతో మందిలో ఉంది. ఎప్పుడైనా ఒక ఇంటికి వెళ్లాల్సిందే కదా అనే ఆలోచన ఎంతో మంది తల్లిదండ్రుల్లో ఉంది. అందుకే వారికి చదివిపించేందుకు నిరాకరిస్తుంటారు. వారికి ఎక్కువ డబ్బు పెట్టే వెనకాడుతుంటారు. ఆస్తుల్లో భాగం ఇచ్చేందుకు నిరాకరిస్తుంటారు. తమ కొడుకులో ఉన్నా రక్తమే కూతురులో కూడా ప్రవహిస్తోందన్న విషయం ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి.

కూతుళ్ల దినోత్సవం వెనక అసలు ఉద్దేశ్యం లింగ సమానత్వం కూడా. మనదేశంలో కొడుకులతోపాటు సమానంగా కూతుళ్లకు ప్రేమ, విద్యావకాశాలు అందించాలని సమాజానికి చెప్పేందుకే ఈ డాటర్స్ డే. తల్లిదండ్రులే వివక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తే..పిల్లల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తే..ఇంకెవరూ వారికి న్యాయం చేయలేరన్న విషయాన్ని గమనించాలి.

భారతదేశంలో కూతుళ్ల పట్ల ప్రేమ చూపే చరిత్రను చూసి ఈ ప్రత్యేక దినోత్సవం పుట్టుకొచ్చింది. జాతీయ కుమార్తెల దినోత్సవం 2007లో మొదటిసారిగా జరుపుకున్నారు. ఒక ఇంట్లో కొడుకు, కూతురు ఇద్దరిలో ఒకరి ఎంచుకోమని చెబుతే చాలా మంది కొడుకునే ఎంచుకుంటారు. యూనిసెఫ్ చెబుతున్న వివరాల ప్రకారం అబ్బాయిల కంటే బాలికల మరణాల రేటు ఎక్కువగా ఉన్న ప్రధాన దేశం మన భారతదేశమే.

మనదేశంలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 900 మంది అమ్మాయిలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐదేండ్ల లోపులో మరణిస్తున్న బాలికల సంఖ్య మన దేశంలోనే ఎక్కువగా ఉంది. చాలా మంది అమ్మాయిలు సొంత ఇంట్లో అధికంగా వివక్షకు గురవుతున్న ఘటనలు మనము ఎన్నో చూస్తున్నాం. వివక్ష నుంచి వారిని రక్షించేందుకు ఈ ప్రత్యేక దినోత్సవం నిర్వహించుకుంటున్నాము. 

Tags:    

Similar News