Dates Health Benefits: ఖర్జూరలో ఫైబర్ అధికం.. ఈ సమస్యలున్నవారికి దివ్యవౌషధం..!
Dates Health Benefits: ఉదయం పూట తినే ఆహారంలో కచ్చితంగా కొన్ని సూపర్ ఫుడ్స్ ఉండాలి. వీటివల్ల రోజు మొత్తం అలసట లేకుండా ఉంటుంది.
Dates Health Benefits: ఉదయం పూట తినే ఆహారంలో కచ్చితంగా కొన్ని సూపర్ ఫుడ్స్ ఉండాలి. వీటివల్ల రోజు మొత్తం అలసట లేకుండా ఉంటుంది. ఇలాంటి వాటిలో ఖర్జూర మొదటి స్థానంలో ఉంటుంది. ఇది పోషకాల భాండాగారం. ఖర్జూరంలో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం తినడం వల్ల శరీరంలో వేడి మెయింటైన్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
మలబద్ధకం నివారణ
మలబద్దకం ఉన్నవారు ఖర్జూరాన్ని తినవచ్చు. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తేలికగా నయం చేస్తుంది. ఇది వ్యక్తి పేగు కదలికలని సులభతరం చేస్తుంది. క్రమం తప్పకుండా ఖర్జూరం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
మెదడు ఆరోగ్యం
ఖర్జూరం తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. దీంతోపాటు పొటాషియం, విటమిన్ B6 ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పొటాషియం లోపం తీరుతుంది
ఖర్జూరం తినడం వల్ల శరీరంలో పొటాషియం లోపం ఉండదు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఖర్జూరాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది తక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది.
ఎముకలు దృఢంగా
ఎముకలు దృఢంగా ఉండాలంటే ఖర్జూరం రోజూ తీసుకోవాలి. ఇందులో కాల్షియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి.
బరువు కంట్రోల్
ఖర్జూరాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటివల్ల బరువు కంట్రోల్‌లో ఉంటుంది. టిఫిన్‌లో ఖర్జూరాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. బరువు తగ్గడంలో ఇది ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఖర్జూరాలు శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి పనిచేస్తాయి.