Fridge Cleaning Tips: ఫ్రిజ్ క్లీన్ చేస్తున్నారా.. ఈ పొరపాట్లు చేయవద్దు..!
Fridge Cleaning Tips: మన నిత్య జీవితంలో ఫ్రిజ్ ఒక భాగంగా మారిపోయింది.
Fridge Cleaning Tips: మన నిత్య జీవితంలో ఫ్రిజ్ ఒక భాగంగా మారిపోయింది. ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు, పాలు మొదలైనవి స్టోర్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే దీని మెయింటనెన్స్ సరిగ్గా లేకపోతే తొందరగా పాడవుతుంది. రెండు వారాలకి ఒకసారి ఫ్రిజ్‌ని క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే అందులో నుంచి దుర్వాసన వస్తుంది. అయితే ఫ్రిజ్‌ను క్లీన్ చేసేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల ఫ్రిజ్ పనితీరు దెబ్బతింటుంది. అందుకే ఫ్రిజ్ ఎలా క్లీన్ చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.
ఫ్రిజ్‌ను శుభ్రపరిచే ముందు అందులో ఉండే పదార్థాలన్నింటిని తీసివేయండి. ఏవైనా ఉపయోగం లేనివి ఉంటే చెత్తబుట్టలో వేయండి. శుభ్రపరిచే ముందు ఫ్రిజ్ స్విచ్ ఆపివేసి విద్యుత్ సరఫరా నుంచి డిస్‌కనెక్ట్ చేయండి. ఇది శుభ్రపరచడాన్ని సులభతరం చేస్తుంది అంతేకాకుండా మీకు ఎలాంటి షాక్ కొట్టకుండా ఉంటుంది. ఫ్రిజ్ అల్మారాలు, డబ్బాలను తీసివేసి వెచ్చని సబ్బు నీటితో క్లీన్ చేయండి. మిగిలిపోయిన పదార్థాల ముక్కలు ఉంటే తీసివేయండి.
రిఫ్రిజిరేటర్ లోపలి భాగాన్ని శుభ్రం చేయడానికి వెచ్చని నీరు, సబ్బుతో కూడిన మిశ్రమాన్ని సిద్ధం చేయండి. ఈ మిశ్రమంతో రాక్‌లు, డబ్బాలు, డోర్లను అన్నింటిని క్లీన్ చేయండి. శుభ్రపరిచిన తర్వాత ఫ్రిజ్ సరైన టెంపరేచర్ వద్ద పనిచేస్తుందా లేదా నిర్ధారించుకోండి. దాని కూల్ సెట్టింగ్‌ను చెక్ చేయండి. టెంపరేచర్ సెట్ చేయడానికి డయల్ లేదా బటన్ ఉంటే దాన్ని సరైన సెట్టింగ్‌కు మార్చండి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఎటువంటి దుర్వాసన రాకుండా ఉంటుంది.