Cinnamon: దాల్చినచెక్కలో అద్భుత ఔషధ గుణాలు.. కానీ అతిగా తీసుకోవడం ప్రమాదకరం..!

Cinnamon: సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ఒకటి.

Update: 2023-03-07 06:36 GMT

Cinnamon: దాల్చినచెక్కలో అద్భుత ఔషధ గుణాలు.. కానీ అతిగా తీసుకోవడం ప్రమాదకరం..!

Cinnamon: సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క ఒకటి. దీనిని వంటలలో మసాలాగా ఉపయోగిస్తారు. ఇది వంటకాలకి ప్రత్యేక రుచిని అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో అద్భుత ఆయుర్వేద గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సీజనల్‌ వ్యాధులని రాకుండా కాపాడుతుంది. అయితే దాల్చిన చెక్కను పరిమితికి మించి తినడం ఆరోగ్యానికి హానికరం. దాల్చిన చెక్క ప్రయోజనాలు అప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

దాల్చినచెక్క ప్రయోజనాలు

1. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

2. శరీర నొప్పిని తొలగించడంలో దాల్చిన చెక్క ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

3. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి దాల్చిన చెక్క దివ్య ఔషధం.

4. దాల్చిన చెక్క తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు పెరగవు.

5. నిత్యం దాల్చిన చెక్కను తినే వారికి జాయింట్ పెన్ సమస్య తక్కువగా ఉంటుంది.

6. దాల్చిన చెక్కను ఆహారంలో కలుపుకుని తీసుకోవడం వల్ల జుట్టు పొడవుగా, దృఢంగా మారుతుంది.

7. దాల్చిన చెక్క మన చర్మానికి సంబంధించిన మొటిమలు, తామర వంటి సమస్యలను తొలగిస్తుంది.

8. పీరియడ్స్ క్రాంప్స్ సమస్యను నివారించడానికి దాల్చిన చెక్కను తినవచ్చు.

9. దాల్చిన చెక్క తినడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. కడుపు సమస్యలు రావు.

రోజుకి దాల్చినచెక్క ఎంత తినాలి..?

ఆరోగ్యవంతమైన పెద్దలు ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని మాత్రమే తీసుకోవాలి. దీని కంటే ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు ఎందుకంటే ఈ మసాలా ప్రభావం చాలా వేడిగా ఉంటుంది. ఇది అనేక రకాల నష్టాలను కలిగిస్తుంది.

దాల్చినచెక్క దుష్ప్రభావాలు

1. ఆహారంలో దాల్చినచెక్కను ఎక్కువగా తీసుకునే వ్యక్తులు కడుపులో మంటను కలిగి ఉంటారు.

2. దాల్చినచెక్కను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అలర్జీ వస్తుంది. మీకు ఇలా జరుగుతుంటే దానిని ఉపయోగించవద్దు.

3. గర్భిణీలు దాల్చిన చెక్కను వైద్యుల సలహా మేరకు మాత్రమే తినాలి. ఎందుకంటే వారు గర్భధారణకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు.

4. పిల్లలకు తల్లిపాలు ఇస్తున్న మహిళలు దాల్చినచెక్క వినియోగాన్ని పరిమితంగా తీసుకోవాలి.

Tags:    

Similar News