Green Banana Benefits: పచ్చి అరటికాయతో మలబద్దకానికి చెక్.. ఇంకా శరీరానికి 5 పెద్ద ప్రయోజనాలు..!

Green Banana Benefits: అరటిపండుని పేదవాడి పండుగా పిలుస్తారు. ఎందుకంటే ఇది తక్కువ ధరలో లభిస్తుంది.

Update: 2023-09-07 16:00 GMT

Green Banana Benefits: పచ్చి అరటికాయతో మలబద్దకానికి చెక్.. ఇంకా శరీరానికి 5 పెద్ద ప్రయోజనాలు..!

Green Banana Benefits: అరటిపండుని పేదవాడి పండుగా పిలుస్తారు. ఎందుకంటే ఇది తక్కువ ధరలో లభిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది. అయితే చాలామందికి పండిన అరటి పండు గురించి మాత్రమే తెలుసు కానీ పచ్చి అరటికాయతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాస్తవానికి పచ్చి అరటిని నేరుగా తినే సాహసం చేయరు. కానీ దక్షిణ భారతదేశంలో చిప్స్ మాత్రం తయారు చేస్తారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అరటి పండు ప్రతి సీజన్‌లో లభిస్తుంది. పచ్చి అరటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

అరటికాయలో లభించే పోషకాలు

అరటిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొవ్వు కణాలను, మలినాలను తొలగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక అరటిపండు తినడం వల్ల శరీరానికి చాలా మంచిది. అరటిలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి6, ప్రొవిటమిన్ ఎ, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, ఫినోలిక్ సమ్మేళనాలు వంటి అనేక లక్షణాలు ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరాన్ని బలంగా తయారుచేస్తాయి.

పచ్చి అరటిపండు ప్రయోజనాలు

పచ్చి అరటి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇందులో ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ జీర్ణవ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తాయి. పచ్చి అరటిపండు షుగర్ రోగులకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు మధుమేహ సమస్యను తగ్గించడంలో ఉపయోగపడతాయి. పచ్చి అరటిపండు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

పచ్చి అరటి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్‌ అంత త్వరగా జీర్ణం కాదు. దీని కారణంగా చాలా సమయం వరకు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో తిండి మీద ధ్యాస ఉండదు. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు. పచ్చి అరటిపండులో అనేక రకాల విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ముఖంపై ముడతలను పోగొట్టడంలో సహాయపడుతాయి. దీంతో నిత్య యవ్వనంగా కనిపిస్తారు.

Tags:    

Similar News