Heart Patients: గుండె వ్యాధులున్నవారు నెయ్యి, వెన్న తినవచ్చా.. నిపుణులు ఏం చెప్పారంటే..?

Heart Patients:ఈ రోజుల్లో చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు బీపీ, స్ట్రోక్, గుండె జబ్బుల సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Update: 2023-11-01 15:00 GMT

Heart Patients: గుండె వ్యాధులున్నవారు నెయ్యి, వెన్న తినవచ్చా.. నిపుణులు ఏం చెప్పారంటే..?

Heart Patients: ఈ రోజుల్లో చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు బీపీ, స్ట్రోక్, గుండె జబ్బుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెద్దవారిలోనే కాకుండా యువతలో కూడా దీని కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హార్ట్ పేషెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవాలి. దీనివల్ల ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఆహారంలో అధిక మొత్తంలో కొవ్వు చేర్చడం వల్ల జబ్బులు పెరుగుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధులున్నవారు ఆహారంలో నెయ్యి, వెన్న చేర్చడం మానుకుంటారు. కానీ నిజంగా నెయ్యి, వెన్నను నివారించాలా లేదా అనేది ఈ రోజు తెలుసుకుందాం.

గుండె జబ్బులున్నవారు నెయ్యి, వెన్న తినాలనే విషయంలో తరచుగా గందరగోళంలో ఉంటారు. నెయ్యి, వెన్నలో సంతృప్త కొవ్వు పుష్కలంగా ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు పెరగడానికి ఇదే కారణం. కానీ హృద్రోగులు ఇంట్లో తయారుచేసిన తెల్ల వెన్న, నెయ్యి తక్కువ మోతాదులో తినవచ్చు. జున్ను, పప్పులు, కూరగాయలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలి. దీనితో పాటు చక్కెర, అధిక సోడియం ఉండే పదార్థాలను పరిమితంగా తీసుకోవాలి. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు బదులుగా ఆహారంలో తృణధాన్యాలు చేర్చాలి.

ఇది కాకుండా ఆహారాన్ని కూడా నియంత్రించాలి. వీలైనంత వరకు హైడ్రేటెడ్ గా ఉండాలి. ఇందుకోసం తగినంత నీరు తాగాలి. ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ పండుగలను ఆస్వాదించాలి. ప్రతి రోజు యోగా, వ్యాయామం చేయాలి. కనీసం రోజులో గంటసేపు వాకింగ్‌ అయినా చేయాలి. అప్పుడే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు.

Tags:    

Similar News