Egg: ఖాళీ కడుపుతో కోడిగుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.?

Egg: కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. అందుకే ప్రతీ రోజూ ఒక గుడ్డు తినమని వైద్యులు సూచిస్తారు.

Update: 2025-02-06 15:00 GMT

Egg: ఖాళీ కడుపుతో కోడిగుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.?

Egg: కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. అందుకే ప్రతీ రోజూ ఒక గుడ్డు తినమని వైద్యులు సూచిస్తారు. చాలా మంది కోడి గుడ్డును ఉదయం టిఫిన్‌గా తీసుకుంటారు. గుడ్డులో పుష్కలంగా లభించే విటమిన్ A, D, E, B12, ఫోలేట్, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే కోడిగుడ్డును ఖాళీ కడుపుతో తీసుకుంటే మాత్రం మంచిది కాదని అంటున్నారు.

ఉదయం పడగడుపు కోడి గుడ్డును తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. కడుపులో ఏం లేకుండా కోడి గుడ్డు తింటే కొంత మందిలో కడుపుబ్బరం, గ్యాస్, కడుపులో తిమ్మిరి, జీర్ణ సంబంధిత సమస్యలు వంటివి వస్తాయని నిపుణులు అంటున్నారు. అలర్జీ సమస్యలతో బాధపడేవారు కూడా ఖాళీ కడుపుతో గుడ్డు తినకూడదు. ముఖ్యంగా తామర, శరీరంలో వాపు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అలాగే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

కొందరిలో ఖాళీ కడుపుతో సగం ఉడికించిన గుడ్లు తింటే సాల్మొనెల్లా బ్యాక్టీరియా పెరిగి అతిసారం, జ్వరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. గుడ్లను ఉదయం టిఫిన్‌ రూపంలో తీసుకుంటే.. శరీరానికి అవసరమైన ఇతర ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే గుడ్లను ఉదయం తినే సమయంలో ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవాలి. బాగా ఉడికించిన తర్వాతే గుడ్లను తినాలి. గుడ్లతో పాటు ఫైబర్‌, విటమిన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఫుడ్‌ను టిఫిన్‌గా తీసుకోవాలి.

నోట్‌: ఈ వివరాలు ఇంటర్నెట్‌ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలే పాటించాలి.

Tags:    

Similar News