Banana Health Benefits: అరటిపండుతో బీపీ అదుపులో.. ఈ ఆరోగ్య సమస్యలకి దివ్యౌషధం..!

Banana Health Benefits: రోజు ఒక అరటిపండు తినడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి.

Update: 2023-07-23 04:43 GMT

Banana Health Benefits: అరటిపండుతో బీపీ అదుపులో.. ఈ ఆరోగ్య సమస్యలకి దివ్యౌషధం..!

Banana Health Benefits: రోజు ఒక అరటిపండు తినడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. దీనివల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా దీనిని పేదల పండుగా చెబుతారు. ఎందుకంటే తక్కువ ధరలో లభిస్తుంది. అయితే ఏదైనా పరిమిత పరిమాణంలో తీసుకోవాలి అధికంగా తింటే అనర్థాలే జరుగుతాయి. ఇది అరటిపండుకి కూడా వర్తిస్తుంది. ఈరోజు అరటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

జీర్ణక్రియ సజావుగా

జీర్ణక్రియకు సంబంధించిన సమస్య ఉంటే రోజూ ఒక అరటిపండు తినాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి చాలా మంచిది.

ఎముకలు దృఢంగా

అరటిపండులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోజూ అరటిపండు తినడం వల్ల ఎముకలు బలపడుతాయి. ముఖ్యంగా పిల్లలు ప్రతిరోజు ఒక అరటిపండు తినేలా ప్రోత్సహించాలి.

బీపీ కంట్రోల్‌లో

అరటిపండులో పొటాషియం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది బీపీని నియంత్రించడానికి పనిచేస్తుంది. కాబట్టి బిపి పేషెంట్లు రోజూ ఒక అరటిపండు తినాలి. ఇలా చేయడం వల్ల వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది.

కొలెస్ట్రాల్ నియంత్రణలో

అరటిపండులో ఉండే పోషకాలు రక్తంలో పేరుకుపోయిన మురికి కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. అందువల్ల కొలెస్ట్రాల్ పెరిగితే ప్రతిరోజూ అరటిపండ్లను తినాలి.

గుండెకు మేలు

అరటిపండ్లను రోజూ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయని అనేక పరిశోధనలలో తేలింది. అందుకే రోజూ 2 అరటిపండ్లు తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Tags:    

Similar News