Blood Clotting: బాడీలో రక్తం గడ్డకట్టే సమస్యలు పెరుగుతున్నాయి.. కారణాలు ఇవే..!

Blood Clotting Problems: ఇటీవల బాడీలో రక్తం గడ్డకట్టే సమస్యలతో చాలామంది చనిపోతు న్నారు.

Update: 2024-05-12 08:29 GMT

Blood Clotting: బాడీలో రక్తం గడ్డకట్టే సమస్యలు పెరుగుతున్నాయి.. కారణాలు ఇవే..!

Blood Clotting: ఇటీవల బాడీలో రక్తం గడ్డకట్టే సమస్యలతో చాలామంది చనిపోతు న్నారు. కరోనా వచ్చినప్పుడు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో రక్తం గడ్డకట్టే సమస్యలు వస్తున్నాయని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. అయితే ఇది అందరికీ జరగడం లేదు. వారి శరీర అవసరాలు, పరిస్థితులను బట్టి జరుగుతోంది. నిజానికి శరీరంలో రక్తం ఎందుకు గడ్డకడు తుంది. ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుంది.. ఈ రోజు తెలుసుకుందాం.

శరీరంలో రక్తం గడ్డకట్టడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రారంభ దశలో చికిత్స చేయకుండా వదిలేస్తే రక్తం గడ్డకట్టి గుండెపోటు, స్ట్రోక్‌లకు దారితీస్తాయి. గర్భనిరోధక మాత్రలు వేసుకునే ప్రతి 1 మిలియన్ మహిళల్లో 1200 మందికి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ కారణంగా చాలా సందర్భాలలో గుండె ధమనులలో రక్తం గడ్డకడుతుంది. దీంతో గుండెపోటు సంభవిస్తుంది.

అలాగే ప్రతి 1 మిలియన్ ధూమపానం చేసేవారిలో 17,000 మందికి రక్తం గడ్డకట్టే సమస్యలు వస్తాయని ఒక పరిశోధనలో తేలింది. ఈస్ట్రోజెన్ ఉన్న మందులు తీసుకోవడం వల్ల కూడా రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో కొవ్వు పెరగడం, మధుమేహం, కీళ్లనొప్పులు, అధిక బీపీ వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. రక్తం గడ్డ కట్టితే రక్త ప్రవాహానికి అంతరాయం ఏర్పడి ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

Tags:    

Similar News