Nerudu Pandu: మధుమేహానికి చెక్ పెట్టే నేరేడు పండు
Nerudu Pandu: నల్లగా నిగనిగగా మెరుస్తూ వగరు, తీపి, పులుపు మేళవింపు రుచులతో ఉండే అల్ల నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Nerudu Pandu: మన పల్లెటూళ్లలో చెరువు గట్టున, లేదా పొలాల గట్టున వుండే నేరేడు చెట్టు దాదాపు అందరికీ సుపరిచతమే. దాని నుండి వచ్చే పండు నేరేడు పండు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కవుగా కనపడతాయి. అందరికీ అందుబాటులోవుండే నల్లగా నిగనిగగా మెరుస్తూ వగరు, తీపి, పులుపు మేళవింపు రుచులతో ఉండే అల్ల నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సంవత్సరం పొడవునా దొరికే నేరేడు.. ఆరోగ్యానికి అమృతం వంటిది. మరి ఈ పండు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.
నేరేడుపండు లో సోడియం, పొటాషియం, క్యాల్షియం, పాస్పరస్, మాంగనీస్, జింక్, విటమిన్ ఎ, సితో పాటు రైబోప్లెనిన్, పోలిక్ యాసిడ్లను సమృద్దిగా ఉంటాయి.
మధుమేహం ఉన్న వారికి నేరేడు పండు మంచి ఔషధం. దీనిని రోజూ తింటే రక్తంలోని చక్కెర శాతం క్రమబద్దీకరించబడుతుంది. తరచూ దాహం వేయడం, మూత్రానికి పోవడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. ఇది మంచి యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది.నేరేడు పండు మాత్రమే కాక ఆకులు, గింజలు, చెట్టు బెరడు కూడా ఔషధాల తయారీలో వాడుతారు. ఈ అల్లనేరేడు చెట్టు కాయల నుండి వెనిగర్‌ను తయారు చేస్తారు. జ్ఞాపకశక్తి మెరుగుపరుచుకోవాలంటే నేరేడు పండ్లు తినమని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నేరేడు పండు రక్తాన్ని శుద్ది చేయడమే కాకుండా రక్తంలో కేన్సర్ కారకాలు వృద్ది చెందకుండా నిరోదిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ మరియు విటమిన్ సి రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.
నేరేడు పండ్లను తినడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేయడంతో పాటు నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. నేరేడు గింజల పొడి ముఖానికి ప్యాక్‌గా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ నేరేడు పండు పురుషుల్లో శృంగార శక్తిని పెంచుతుంది.
నేరేడు పండు మన జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలకు ఇది ఒక చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. కడుపు ఉబ్బరం మరియు వాంతి అయ్యేలా ఉండే లక్షణాలను తగ్గిస్తుంది. మలబద్దకంతో పాటు మూత్ర సంబందిత సమస్యలను నివారిస్తుంది. ఆస్తమా మరియు ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేస్తుంది. అనేక చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా కీళ్లనొప్పులను మరియు లివర్ సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతుంది.
శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే ఆరోగ్యప్రదాయిని అల్లనేరేడు పండు దొరికే సీజన్ లో రెగ్యులర్ గా తీసుకోవడానికి ప్రయత్నస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.