Health Tips: అధిక కొలస్ట్రాల్‌కి ఆయుర్వేద టీ.. అలవాటైతే అద్భుత ఫలితాలు..!

Health Tips: ఈ రోజుల్లో అధిక కొలస్ట్రాల్‌తో చాలామంది బాధపడుతున్నారు.

Update: 2023-03-06 10:30 GMT

Health Tips: అధిక కొలస్ట్రాల్‌కి ఆయుర్వేద టీ.. అలవాటైతే అద్భుత ఫలితాలు..!

Health Tips: ఈ రోజుల్లో అధిక కొలస్ట్రాల్‌తో చాలామంది బాధపడుతున్నారు. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, జంక్‌ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయానికి గురవుతున్నారు. పెరిగిన బరువుని తగ్గించుకోవడానికి చాలామంది చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితం ఉండటం లేదు. కానీ ప్రతిరోజు ఒక చేదు టీ తాగడం అలవాటు చేసుకుంటే ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. ఈ ఆయుర్వేద టీ వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

చేదుని దాదాపుగా ఎవ్వరూ ఇష్టపడరు. కానీ ఔషధ గుణాలు ఇందులోనే ఎక్కువగా ఉంటాయి. చాలా ఏళ్ల నుంచి మన పెద్దలు తినమని చెబుతున్న కూరగాయ కాకరకాయ. దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. కానీ దీనివల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కానీ ఎవ్వరూ పట్టించుకోరు. కారణం ఇది చేదుగా ఉండటమే. కాకరకాయ రసం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

దీనివల్ల శరీరంలో అంతర్గత ప్రక్షాళన జరుగుతుంది. అనేక వ్యాధులకి దూరంగా ఉంటాం. కానీ దీని రసాన్ని తాగడం అంతసులభం కాదు. మీరు కాకరకాయను మరొక విధంగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటే అద్భుతమైన హెర్బల్ టీని తయారుచేసుకొని ప్రతిరోజు తాగవచ్చు. ఇది అంత ప్రాచుర్యం పొందకపోయినా ప్రయోజనాలు మాత్రం విపరీతంగా ఉంటాయి. ఎండిన కాకర ముక్కలను నీటిలో వేసి టీ తయారుచేసుకోవచ్చు.

కాకర టీని ఔషధ టీగా విక్రయిస్తారు. కాకర టీ పొడి లేదా సారం రూపంలో లభిస్తుంది. దీనిని గోహ్యా టీ అని కూడా పిలుస్తారు. ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. కాకరకాయ రసంలా కాకుండా దాని ఆకులు, పండ్లు, గింజలను ఉపయోగించి టీని ఒకేసారి తయారు చేసుకొని ప్రతిరోజు తాగవచ్చు. దీనివల్ల శరీరంలో అధికంగా ఉండే కొవ్వు మైనంలా కరుగుతుంది. కాకరకాయ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీని సహాయంతో రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. మీరు ఈ హెర్బల్ టీని రోజుకు రెండుసార్లు తాగితే సరిపోతుంది.

Tags:    

Similar News