Helmet: హెల్మెట్‌ కొనేటప్పుడు ఈ విషయాలు గమనించడం మర్చిపోవద్దు..!

Helmet: చాలామంది బైక్‌ రైడ్‌ చేసేటప్పుడు హెల్మెట్‌ ధరించడం లేదు.

Update: 2023-05-21 16:00 GMT

Helmet: హెల్మెట్‌ కొనేటప్పుడు ఈ విషయాలు గమనించడం మర్చిపోవద్దు..!

Helmet: చాలామంది బైక్‌ రైడ్‌ చేసేటప్పుడు హెల్మెట్‌ ధరించడం లేదు. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది నాసిరకం హెల్మెట్లని కొనుగోలు చేసి ప్రమాదాలకి గురవుతున్నారు. వీటివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాలని బలితీసుకుంటుంది. బైక్‌పై వెళ్లేటప్పుడు ప్రమాదం జరిగితే హెల్మెట్‌ మాత్రమే మీ ప్రాణాలని కాపాడుతుందని గుర్తుంచుకోండి. ఇలాంటి ముఖ్యమైన హెల్మెట్‌ కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

హెల్మెట్‌ని కొనేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. చలాన్‌ను తప్పించుకోవడానికి తక్కువ నాణ్యత గల హెల్మెట్‌ని కొనుగోలు చేస్తారు. కానీ మీ ప్రాణాల కన్నా డబ్బు ఎక్కువకాదని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఇదే మీ జీవితానికి శత్రువు అవుతుందని మర్చిపోవద్దు. మీ భద్రతకు సంబంధించి మెరుగైన నాణ్యమైన హెల్మెట్‌ను కొనుగోలు చేయాలి. హెల్మెట్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.

1. హెల్మెట్ కొనుగోలు చేసేటప్పుడు మీ తలకి సరిపోయే హెల్మెట్‌ను కొనుగోలు చేయండి.

2. హెల్మెట్ తలకు సౌకర్యంగా ఉందా లేదా అని ట్రై చేయండి. ఒకవేళ సౌకర్యంగా లేకుంటే బైక్‌పై వెళ్లేటప్పుడు దృష్టి మరలుతుందని గుర్తుంచుకోండి.

3. మీకు సరైన వెంటిలేషన్ ఉండే హెల్మెట్ తీసుకోండి.

4. ఇప్పుడు చాలా హెల్మెట్లు ఫైబర్గ్లాస్ మిశ్రమంతో తయారు చేస్తున్నారు. ఇవి నాసిరకానికి చెందినవి. అత్యుత్తమ నాణ్యత గల హెల్మెట్‌లలో కార్బన్ మిశ్రమాలు, కెవ్లార్‌లను ఉపయోగిస్తారు. ఇది మీ తల నుంచి వచ్చే చెమటను కూడా గ్రహిస్తుంది.

5. ఎల్లప్పుడూ అత్యుత్తమ నాణ్యత గల హెల్మెట్‌ను కొనుగోలు చేయండి. ISI మార్క్ హెల్మెట్‌ను మాత్రమే కొనుగోలు చేయండి.

Tags:    

Similar News