Health Tips: పొట్టచుట్టూ కొవ్వు ఏర్పడితే జాగ్రత్త.. ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువ..!

Health Tips: ప్రపంచంలో ప్రతి సంవత్సరం మార్చి నెలను కొలొరెక్టల్ క్యాన్సర్ అవగాహన నెలగా నిర్వహిస్తారు.

Update: 2023-03-11 16:00 GMT

Health Tips: పొట్టచుట్టూ కొవ్వు ఏర్పడితే జాగ్రత్త.. ఈ వ్యాధి ప్రమాదం ఎక్కువ..!

Health Tips: ప్రపంచంలో ప్రతి సంవత్సరం మార్చి నెలను కొలొరెక్టల్ క్యాన్సర్ అవగాహన నెలగా నిర్వహిస్తారు. ఈ వ్యాధి సంభవించినప్పుడు పెద్ద ప్రేగు లేదా పురీషనాళంలోని ఏదైనా భాగంలో ప్రమాదకరమైన కణితి ఏర్పడుతుంది. తరువాత ఇది క్యాన్సర్ రూపాన్ని సంతరించుకుంటుంది. ఈ వ్యాధిని కొలొరెక్టల్ క్యాన్సర్ అంటారు. ఇది చాలా తీవ్రమైన వ్యాధి. దీని కారణంగా ఒక వ్యక్తి చనిపోవచ్చు. ఈ రోజు మనం ఈ వ్యాధి లక్షణాలు, దాని అభివృద్ధికి కారణాల గురించి తెలుసుకుందాం.

కొలొరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు

మీ కడుపు ఒక్కసారిగా క్లియర్ కాకపోతే మళ్లీ మళ్లీ టాయిలెట్‌కు వెళ్లాలని అనిపిస్తే అది కొలొరెక్టల్ క్యాన్సర్ లక్షణం అయి ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు వెంటనే నిపుణుడైన వైద్యుడిని సంప్రదించాలి. అలాగే అకారణంగా బరువు తగ్గడం ప్రారంభిస్తే అది శరీరంలో ప్రమాదకరమైన కణితులు ఏర్పడటానికి సంకేతమని చెప్పొచ్చు. వాస్తవానికి ఇది పురీషనాళం లేదా పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రత్యేక లక్షణం. దీనిని ఎప్పుడు విస్మరించకూడదు.

మలంలో రక్తం

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధన ప్రకారం.. ఎవరైనా కడుపులో నిరంతరం నొప్పిని అనుభవిస్తూ ఉంటే, బలహీనత, అలసట ఉంటే అది కొలొరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. ఈ సందర్భాలలో వైద్యుడి వద్దకు వెళ్లడంలో ఆలస్యం చేయకూడదు.

అధిక కొవ్వు పదార్ధాలు

వైద్యుల ప్రకారం కొలొరెక్టల్ క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిలో అధిక కొవ్వు పదార్ధాలు తినడం, తక్కువ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, తక్కువ పండ్లు, కూరగాయలు తీసుకోవడం వంటివి ఉంటాయి.

Tags:    

Similar News