Bale Leaves: బేల్ ఆకులు డయాబెటీస్ నుంచి మలబద్దకం వరకు సూపర్ రెమిడి..!
Bale Leaves: నేటి ఆధునిక జీవనశైలిలో మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడం చాలా కష్టంగా మారుతోంది.
Bale Leaves: నేటి ఆధునిక జీవనశైలిలో మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడం చాలా కష్టంగా మారుతోంది. అనేక రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇందులో మధుమేహం, గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు ఉన్నాయి. ఈ పరిస్థితిలో బేల్ ఆకులను తినడం ద్వారా ఈ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఈ ఆకులను మహాశివుడు చాలా ఇష్టపడుతాడు. అంతేకాదు నైవేద్యంగా పెడుతారు. అంతటి ప్రాధాన్యత ఈ ఆకులకి ఉంది. బేల్ ఆకుల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
బేల్ ఆకులను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని కొద్ది మందికి మాత్రమే తెలుసు. వీటిని తినడం వల్ల అనేక రకాల సమస్యలు దూరమవుతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, పోషక మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ సి, రిబోఫ్లోబిన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ బి1, బి6, బి12 ఉంటాయి. పచ్చి ఆకులు మలబద్దకాన్ని తొలగించడంలో బాగా ఉపయోగపడతాయి. లేత ఉప్పు, ఎండుమిర్చితో బేల్ ఆకులను తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకులు జీర్ణ శక్తిని పెంచుతాయి.
బేల్ ఆకులు కడుపుని శుభ్రం చేయడానికి సూపర్‌గా పనిచేస్తాయి. ఇది భేదిమందు లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మీకు జీర్ణ సమస్యలు ఉంటే బెల్ ఆకులను తీసుకుంటే మంచిది. వేసవి కాలంలో బేల్ సిరప్ తాగుతారు. కానీ, దాని ఆకులను ఏడాది పొడవునా ఉపయోగించవచ్చు. గుండెల్లో మంటగా ఉన్నట్లయితే, దాని ఆకులను నీటితో మెత్తగా రుబ్బుకుని, వడపోసి రోజుకు రెండు మూడు సార్లు త్రాగాలి. ఇలా చేయడం వల్ల మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.