Baldness Reasons: బట్టతల అబ్బాయిలలో అధికం.. అమ్మాయిలలో అరుదు.. ఎందుకంటే..?
Baldness Reasons: నేటి రోజుల్లో బట్టతల బాధితులు విపరీతంగా పెరిగిపోయారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్య మగవారిలో అధికంగా ఉంటుంది కానీ ఆడవారిలో అరుదుగా కనిపిస్తుంది.
Baldness Reasons: నేటి రోజుల్లో బట్టతల బాధితులు విపరీతంగా పెరిగిపోయారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ సమస్య మగవారిలో అధికంగా ఉంటుంది కానీ ఆడవారిలో అరుదుగా కనిపిస్తుంది. సాధారణంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం జీవనశైలిలో మార్పులు రావడమే. హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు ఊడిపోతుంది. అంతేకాకుండా కొన్ని రకాల ఆహారపు అలవాట్లు కూడా ఈ సమస్యకి కారణమవుతాయి.
పురుషులలో జుట్టు పెరగడానికి, జుట్టు రాలడానికి ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత. వాస్తవానికి సెక్స్ హార్మోన్ అని పిలువబడే టెస్టోస్టెరాన్ తలలో జుట్టు పెరుగుదలకు బాధ్యత వహిస్తుంది. ఈ హార్మోన్ అబ్బాయిలలో కనిపించే ఆండ్రోజెన్ హార్మోన్ సమూహంలో భాగం. అయితే శరీరంలో ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గినప్పుడు అబ్బాయిలలో జుట్టు రాలడం మొదలవుతుంది. అది విపరీతంగా తగ్గితే బట్టతల వస్తుంది.
మహిళల్లో బట్టతల గురించి మాట్లాడితే వారిలో టెస్టోస్టెరాన్ పరిమాణం తక్కువగా ఉంటుంది. దీంతో పాటు వారిలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ రెండు కారణాల వల్ల మహిళల్లో టెస్టోస్టెరాన్ డైహైడ్రోటెస్టోస్టెరాన్‌గా మారే వేగం తక్కువగా ఉంటుంది. దీని వల్ల వారిలో బట్టతల సమస్య కనిపించదు. మెనోపాజ్ లేదా గర్భధారణ సమయంలో జుట్టు రాలడం కొంత వరకు ఉన్నప్పటికీ ఇది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది
ఇతర కారణాలు
మహిళల్లో జుట్టు రాలడానికి మరికొన్ని కారణాలు కూడా ఉంటాయి. వీటిలో మానసిక ఒత్తిడి, వృద్ధాప్యం లేదా ఏదైనా వ్యాధి సమస్యలు ఉన్నప్పుడు జుట్టు పల్చబడడం, జుట్టు రాలడం, నెరిసిపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ పూర్తిగా బట్టతలగా మారడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇది పురుషులలో సాధారణంగా జరుగుతుంది.