Magic Drinks: పొల్యూషన్‌ వల్ల ఊపిరితిత్తులపై చెడు ప్రభావం.. ఈ 'మ్యాజిక్ డ్రింక్స్' తాగండి..!

Magic Drinks: చలికాలం ప్రారంభమైంది. దీంతో పొల్యూషన్‌ మొదలైంది. దీనివల్ల శ్వాస సంబంధమైన వ్యాధులున్నవారు, ఆస్తమా పేషెంట్లు చాలా ఇబ్బందిపడుతారు.

Update: 2023-11-05 13:30 GMT

Magic Drinks: పొల్యూషన్‌ వల్ల ఊపిరితిత్తులపై చెడు ప్రభావం.. ఈ 'మ్యాజిక్ డ్రింక్స్' తాగండి..!

Magic Drinks: చలికాలం ప్రారంభమైంది. దీంతో పొల్యూషన్‌ మొదలైంది. దీనివల్ల శ్వాస సంబంధమైన వ్యాధులున్నవారు, ఆస్తమా పేషెంట్లు చాలా ఇబ్బందిపడుతారు. విషపూరితమైన గాలి పీల్చడం ప్రజలకు ప్రమాదకరంగా మారుతోంది. కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడమే కాకుండా దగ్గు, ఊపిరితిత్తులపై చెడు ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిలో ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి సరైన ఆహారపు అలవాట్లు పాటించాలి. ఊపిరితిత్తులను టాక్సిఫికేషన్‌ చేయడానికి కొన్నిరకాల డ్రింక్స్‌ని తీసుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బంగారు పాలు

పసుపు పాలను గోల్డెన్ మిల్క్ అంటారు. పసుపు పాలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల్లో మంటను తగ్గించడంలో సహాయపడుతాయి.

గ్రీన్ టీ

బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీ తాగుతారు. కానీ ఇది ఊపిరితిత్తులను ఆరోగ్యంగా చేస్తుంది. ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇందులో కేటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల కణజాలంపై యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రోజూ ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు.

బీట్రూట్ రసం

బీట్‌రూట్ శరీరంలో రక్తం లేకపోవడాన్ని నివారిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు బీట్‌రూట్‌ రసం తాగుతారు. అయితే ఇది ఊపిరితిత్తులకు కూడా చాలా మేలు చేస్తుంది. బీట్‌రూట్‌ యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్‌లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తులలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

తేనె, నీరు

కాలుష్యం కారణంగా ప్రజలు తరచుగా దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతారు. గోరువెచ్చని నీరు, తేనె కలిపి తాగాలి. ఈ డ్రింక్‌ ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తుంది.

Tags:    

Similar News