Toothache Problems: పంటి నొప్పి ఇబ్బందికరం.. ఈ చిట్కాలతో నివారించండి..!
Toothache Problems: కొంతమంది దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోరు. దీనివల్ల పంటినొప్పి, చిగురు సమస్యలు ఎదురవుతాయి.
Toothache Problems: కొంతమంది దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోరు. దీనివల్ల పంటినొప్పి, చిగురు సమస్యలు ఎదురవుతాయి. రాత్రిపూట ఈ నొప్పి మరింత తీవ్రమవుతుంది. భరించలేనిదిగా మారుతుంది. నిద్రలేని రాత్రులు గడపాల్సివస్తోంది. రోజువారీ పనులపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి సమయంలో ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. ఉప్పు, లవంగాలు
కొన్ని లవంగాలను తీసుకొని మెత్తగా పొడి రూపంలోకి మార్చుకోవాలి. దీనికి చెంచా ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు నొప్పిగా ఉన్న దంతాల మధ్య నొక్కాలి. ఉదయం లేవగానే నొప్పి తగ్గిపోతుంది.
2. పసుపు, ఉప్పు
ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీరు, టీస్పూన్ పసుపు పొడి, అర టీస్పూన్ ఉప్పు వేసి పేస్టులా చేయాలి. దీనిని దంతాలపై అప్లై చేయాలి. క్రమంగా పంటి నొప్పి తగ్గిపోతుంది.
3. వేప ఆకులు
వేప ఆకులను గ్రైండ్ చేసి, వాటి రసం గ్లాసు నీటిలో కలిపి పుక్కిలించాలి. ఇది పంటి నొప్పిని కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
4. ఉల్లిపాయ ముక్కలు
ఉల్లిపాయను వంటకాల్లో రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే దీన్ని కట్ చేసి పళ్ల మధ్య నొక్కి పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది.
5. నిమ్మరసం
దంతాలను దెబ్బతీసే బ్యాక్టీరియాకు నిమ్మరసం ఒక శత్రువు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో నిమ్మరసం పిండి ఆ నీటితో పుక్కిలించాలి. వెంటనే పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.