Kidney Damage: కిడ్నీలు దెబ్బతినకుండా ఉండాలంటే ఇప్పుడే ఈ ఆహారాలు వదిలేయండి..!

Kidney Damage: కిడ్నీలు దెబ్బతినకుండా ఉండాలంటే ఇప్పుడే ఈ ఆహారాలు వదిలేయండి..!

Update: 2022-12-06 04:46 GMT

Kidney Damage: కిడ్నీలు దెబ్బతినకుండా ఉండాలంటే ఇప్పుడే ఈ ఆహారాలు వదిలేయండి..!

Kidney Damage: కిడ్నీ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఎందుకంటే ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది. శరీరం నుంచి విషపూరిత పదార్థాలని బయటకు పంపిస్తుంది. కానీ మధుమేహం కిడ్నీని దెబ్బతీస్తుంది. మూత్రపిండాలు దెబ్బతినకుండా ఉండాలంటే రక్తంలో చక్కెరను నియంత్రించడం అవసరం. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

రక్తంలో చక్కెర స్థాయి అదుపు తప్పితే క్రమంగా అది కిడ్నీలో ఉండే రక్తనాళాల సమూహాన్ని పాడు చేస్తుంది. ఈ రక్త నాళాలు బలహీనంగా మారినప్పుడు మూత్రపిండాలు రక్తాన్ని సరిగ్గా శుభ్రపరచలేవు. దీని కారణంగా అధిక రక్తపోటు సమస్య మొదలవుతుంది. దీంతో కిడ్నీ దెబ్బతింటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగికి చక్కెర నియంత్రణలో ఉంచడం అత్యవసరం.

జీవనశైలిలో అనేక మార్పులను తీసుకురావాలి. ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కోపాన్ని తగ్గించుకోవాలి. ఒత్తిడికి గురికావొద్దు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ యోగా చేయాలి. రక్తపోటు సమస్య ఉంటే దానిని అదుపులో ఉంచాలి. ఎక్కువ కాలం కడుపు నొప్పిగా ఉంటే నెఫ్రోపతి పరీక్ష చేయించుకోవాలి.

ఈ ఆహారాలకు దూరం

ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దు. అధిక పొటాషియం ఉన్న కూరగాయలకు దూరంగా ఉండాలి. ఉదా- బంగాళాదుంప, టొమాటో, కివి, నారింజ, అవకాడో లాంటి వాటికి దూరంగా ఉండాలి.

పాలు, పెరుగు, జున్ను నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఫాస్పరస్‌ ఎక్కువగా ఉంటుంది. డబ్బాల్లో నిల్వ చేసినవాటిని తినకూడదు. పచ్చళ్లు, ఎండు చేపలు, శీతల పానీయాలు తీసుకోవద్దు.

Tags:    

Similar News