Health Tips: సాక్స్ లేకుండా షూ వేసుకుంటున్నారా.. ఈ సమస్యల ప్రమాదం ఎక్కువ..!
Health Tips: ప్రతి వస్తువు లేదా పరికరాన్ని వాడే పద్దతి ఒకటుంటుంది. అది అలాగే ఉపయోగిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి లేదంటే రివర్స్ ఫలితాలు వస్తాయి.
Health Tips: ప్రతి వస్తువు లేదా పరికరాన్ని వాడే పద్దతి ఒకటుంటుంది. అది అలాగే ఉపయోగిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి లేదంటే రివర్స్ ఫలితాలు వస్తాయి. అలాగే ఈ రోజుల్లో మనం తినే తిండి, తాగే నీరు, ధరించే బట్టల విధానం కూడా మారిపోయింది. మన ఫ్యాషన్ ట్రెండ్స్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు కాలంలో బెల్ బాటమ్ ప్యాంటు ట్రెండ్ నడిచేది ప్రస్తుతం టైట్ జీన్స్ ట్రెండ్ నడుస్తోంది. అదేవిధంగా షూల ఫ్యాషన్ ట్రెండ్ కూడా మారిపోయింది. చాలా మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు ఆరోగ్యానికి హానికరమని తాజా పరిశోధనలో తేలింది. దీని వల్ల పాదాలే కాదు ఆరోగ్యానికి సంబంధించిన ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
చెమట
దీనికి సంబంధించిన పరిశోధనలో ఒక వ్యక్తి పాదాలు రోజుకు 300 మి.లీ. చెమటను విడుదల చేస్తాయి. సాక్స్ లేకుండా ఈ చెమట ఆరిపోదు. దీని కారణంగా పాదాలలో తేమ పెరుగుతుంది. అనేక రకాల బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది.
ఈ సమస్యలు
అలర్జీ: కొందరి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వారి చర్మం సింథటిక్ పదార్థంతో చర్య జరపడం వల్ల అలెర్జీలు సంభవిస్తాయి. కచ్చితంగా సాక్స్‌తో పాటు బూట్లు ధరించడం ఉత్తమం.
రక్త ప్రసరణ: ఇది వినడానికి మీకు వింతగా అనిపించవచ్చు, కానీ సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలకు హాని జరగడమే కాకుండా రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి.
పరిష్కారం ఏమిటి..?
ఏదైనా షూ వేసుకునే ముందు అది సరైనదో కాదో తెలుసుకోవాలి. బిగుతుగా లేదా వదులుగా ఉండే బూట్లు ధరించవద్దు. మంచి నాణ్యమైన సాక్స్‌లను ధరించాలి. ప్రతిరోజు వాటిని మార్చాలి. ఒక రోజు కంటే ఎక్కువ రోజులు సాక్స్ ధరించవద్దు.