Health Tips: వాడిన టవల్‌నే మళ్లీ మళ్లీ వాడుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే అలా చేయరు..!
Health Tips: ప్రతిఒక్కరు స్నానం చేసిన తర్వాత టవల్‌తో శరీరాన్ని తుడుచుకుంటారు.
Health Tips: ప్రతిఒక్కరు స్నానం చేసిన తర్వాత టవల్‌తో శరీరాన్ని తుడుచుకుంటారు. కొన్నిసార్లు కుటుంబంలో అందరు కలిసి ఒకే టవల్‌వాడుతారు. మరికొంతమంది ఎవరికి వారే ప్రత్యేక టవల్‌ని వాడుతారు. ఏది ఏమైనప్పటికీ ఉపయోగించిన టవల్‌నే మళ్లీ మళ్లీ ఉపయోగించకూడదు. టవల్‌ని ఎన్నిరోజులకొకసారి ఉతకాలో చాలామందికి తెలియదు. టవల్‌ని పదే పదే ఉపయోగించడం వల్ల అందులో బాక్టీరియా చేరి రకరకాల వ్యాధులకి కారణమవుతాయి. టవల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
శరీరాన్ని టవల్‌తో తుడుచుకున్నప్పుడు కొన్ని రకాల బ్యాక్టీరియా దాని పోగులకి అంటుకొని అలాగే ఉంటుంది. తడివల్ల బ్యాక్టీరియా పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో టవల్‌ను ఉతకకుండా పదే పదే ఉపయోగిస్తే ఆ బ్యాక్టీరియా చర్మం, ముక్కు ద్వారా శరీరం లోపలికి చేరుకుంటుంది. మిమ్మల్ని తీవ్రమైన అనారోగ్యానికి గురి చేస్తుంది. అందుకే టవల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సాధారణంగా టవల్‌ని 2-3 సార్లు ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా డిటర్జెంట్‌తో నానబెట్టి ఉతకాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి మాత్రమే ఆ టవల్ ఉపయోగిస్తుంటే దానిని 3 రోజుల తర్వాత ఉతకాలి. ఇంట్లోని వారందరూ ఒకే టవల్‌ని ఉపయోగిస్తే రోజూ ఉతకడం తప్పనిసరి అవుతుంది. 2-3 రోజులకు ఒకసారి టవల్ ఉతికేవారు శరీరాన్ని తుడుచుకున్న తర్వాత రోజూ ఎండలో ఆరబెట్టడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల దానిలో నిల్వ ఉన్న తేమ తొలగిపోతుంది. దీని కారణంగా క్రిములు అందులో ఉండే అవకాశం ఉండదు. లేదంటే శరీరంలో రింగ్ వార్మ్, దురద వచ్చి తీవ్రమైన చర్మవ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.