Health Tips: బరువు తగ్గడానికి సప్లిమెంట్లు వాడుతున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..!

Health Tips: ఆధునిక కాలంలో జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. శ్రమ తగ్గిపోవడంతో చాలామంది స్థూలకాయులుగా మారుతున్నారు.

Update: 2023-11-21 09:30 GMT

Health Tips: బరువు తగ్గడానికి సప్లిమెంట్లు వాడుతున్నారా.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..!

Health Tips: ఆధునిక కాలంలో జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. శ్రమ తగ్గిపోవడంతో చాలామంది స్థూలకాయులుగా మారుతున్నారు. గంటల సేపు కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల కొవ్వు పేరుకుపోయి లావుగా తయారవుతున్నారు. ఇలాంటి వ్యక్తులు తర్వాత బరువు తగ్గడానికి మార్కెట్‌లో లభించే వివిధ సప్లిమెంట్లను వాడుతున్నారు. అయితే ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. కొన్ని సప్లిమెంట్లు తక్షణ ఫలితాలను ఇవ్వవచ్చు కానీ ధీర్ఘకాలికంగా దుష్ప్రభావాలు ఉంటాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

డైట్ సప్లిమెంట్స్ ముఖ్యంగా గుండెపై నెగటివ్‌ ప్రభావాన్ని చూపుతాయి. వీటిలో హృదయ స్పందన రేటు, రక్తపోటును పెంచే రసాయనాలు ఉంటాయి. ఇవి గుండెపై ఒత్తిడిని పెంచుతాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుంది. అదనంగా డైట్ మాత్రలు జీవక్రియకు అంతరాయం కలిగిస్తాయి. జీవక్రియను పెంచుతాయి లేదా ఆకలిని తగ్గిస్తాయి. కొన్ని డైట్ మాత్రలు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. ఇవి ఋతు చక్రం, సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది.

కొన్ని సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, కాలేయ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. సప్లిమెంట్లను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. మీ వ్యక్తిగత పరిస్థితిని బట్టి మీకు ఏ సప్లిమెంట్లు సరిపోతాయో వాటిని ఎలా ఉపయోగించాలో చెబుతారు. సప్లిమెంట్లను ఉపయోగించే ముందు శరీరం పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే ముందుగా వైద్యుడిని సంప్రదించాలి. 

Tags:    

Similar News